For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Pushpa The Rise Trailer: ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సుకుమార్.. వచ్చేది ఎప్పుడంటే?

    |

    టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో కూడా నెవర్ బిఫోర్ అనేలా పుష్ప సినిమాని తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు సుకుమార్ అల్లు అర్జున్ కెరీర్ లోనే కాకుండా సుకుమార్ కెరీర్ లో కూడా ఇదే అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం. మైత్రి మూవీ మేకర్స్ కూడా మొదటిసారి పాన్ ఇండియా ప్రపంచంలోకి అడుగు పెడుతోంది. వరుస బాక్స్ ఆఫీస్ హిట్స్ తో దూసుకుపోతున్న మైత్రి మూవీ మేకర్స్ పుష్ప సినిమా బడ్జెట్ విషయంలో కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.

    హై బడ్జెట్

    హై బడ్జెట్

    మొదట 150కోట్ల బడ్జెట్ లోపే పుష్ప సినిమాని నిర్మించాలని అనుకున్నారు. కానీ ఆ తర్వాత రెండు భాగాలుగా విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. దీంతో బడ్జెట్ 180 కోట్ల వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. సుకుమార్ ప్లానింగ్ కు తగ్గట్టుగానే మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

    దేవిశ్రీప్రసాద్ స్పెషల్ ఫోకస్

    దేవిశ్రీప్రసాద్ స్పెషల్ ఫోకస్

    పుష్ప సినిమాలో రష్మిక మందన పాత్ర కూడా సరికొత్తగా ఉంటుందని విడుదలైన పోస్టర్ తోనే క్లారిటీ వచ్చేసింది. అంతే కాకుండా ఇప్పటి వరకు విడుదలైన మూడు పాటలు కూడా సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశాయి. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం విషయంలో కూడా చాలా కొత్తగా ఆలోచించినట్లు అర్థమవుతోంది. ఆర్య, ఆర్య 2 సినిమాల అనంతరం ఈ కాంబినేషన్ ఇలాంటి సినిమాతో వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇక పుష్ప సినిమా ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

    ట్రైలర్ డేట్ ఫిక్స్

    ట్రైలర్ డేట్ ఫిక్స్

    సినిమాను డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్న విషయం తెలిసిందే. ఇక సినిమా ట్రైలర్ ను డిసెంబర్ 6వ తేదీన సోమవారం విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఫైనల్ కట్ కూడా రెడీ అయినట్లు సమాచారం. ఇప్పటికే సుకుమార్ కొంతమంది అగ్ర దర్శకులు కూడా ఆ ట్రైలర్ ను చూపించాడట. ట్రైలర్ అద్భుతంగా ఉందని చెబుతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు సుకుమార్ ఈ సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నాడు.

    సంచలన రికార్డులను..

    సంచలన రికార్డులను..

    తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని నిర్మాతలు కూడా ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు అర్థమవుతోంది. సినిమా ట్రైలర్ కూడా అన్ని భాషల్లోనూ ఒకేసారి విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే టీజర్ యూ ట్యూబ్ లో సంచలన రికార్డులను సొంతం చేసుకుంది. అల్లు అర్జున్ స్టార్ హోదా ఏ స్థాయిలో ఉందో అప్పుడే క్లారిటీగా అర్థం అయింది. ఇక ఇప్పుడు ట్రైలర్ ఏ స్థాయిలో వ్యూవ్స్ అందుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. పుష్ప సినిమాపై తెలుగు ఇండస్ట్రీ లోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీ మొత్తంలో కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి.

    బాలీవుడ్ లో స్పెషల్ ప్రమోషన్స్

    బాలీవుడ్ లో స్పెషల్ ప్రమోషన్స్

    అయితే హిందీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందనే విషయంలో చిత్రం ఇంతవరకు ఒక క్లారిటీకి రాలేదు అక్కడ కూడా ప్రమోషన్స్ గట్టిగానే చేయాలని అనుకుంటున్నారు. అయితే అల్లు అర్జున్ అందరికీ తెలిసిన పేరు కాబట్టి ఇంకాస్త ఎక్కువ ప్రమోషన్స్ చేయాలని అనుకుంటున్నారు. అల్లు అర్జున్ కు సంబంధించిన ప్రతి సినిమా హిందీలో డబ్బింగ్ అవుతూ ఉంటుంది. యూట్యూబ్ లో అయితే వందల మిలియన్ల వ్యూవ్స్ అందుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. ఇక పుష్ప సినిమా మొదటి బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో క్రేజ్ అందుకుంటుందో చూడాలి.

    English summary
    Allu arjun Pushpa The Rise Trailer release date fix
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X