Don't Miss!
- Sports
ఆ విషయంలో వృద్ధిమాన్ సాహాకు లైన్ క్లియర్.. ఇక రంజీట్రోఫీలో ఆ జట్టు తరఫున బరిలోకి..
- Technology
మే నెలలో 96 మిలియన్ల యూనిట్లకు పడిపోయిన SmartPhone విక్రయాలు!
- News
ఒక్కరు చెప్పేది 135 కోట్ల మంది వినాలా-హైదరాబాద్ లో యశ్వంత్ సిన్హా కీలక కామెంట్స్..
- Finance
Lottery: నక్కతోక తొక్కిన ట్రక్ డ్రైవర్.. రూ. 7.50 కోట్లు తెచ్చిపెట్టిన లాటరీ టికెట్.. అదృష్టం..
- Automobiles
జున్ నెల అమ్మకాలలో అదరగొట్టిన టీవీఎస్ మోటార్ కంపెనీ.. జులై 6న కొత్త టూవీలర్ లాంచ్!
- Lifestyle
పడక గదిలో మీ భర్త లేదా భార్య మీకు దగ్గరగా ఉండకపోవడానికి కారణం ఏంటో తెలుసా?
- Travel
మన్యంలో మరుపురాని దృశ్యాలు రెండవ భాగం
Allu Arjun's Pushpa Mania.. ప్యాన్ ఇండియా సినిమాలను తలదన్నే ఆఫర్లు!
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పూర్తిగా కరోనా భయం తొలగిపోని రోజుల్లో కూడా సౌత్, నార్త్ రాష్ట్రాల్లో కూడా సినిమా అద్భుతమైన కలెక్షన్లు రాబట్టింది. అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా మొదటి భాగం డిసెంబర్ నెలలో విడుదలై అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా ఫహాద్ ఫాజిల్, సునీల్ అనసూయ వంటి వారు నెగిటివ్ పాత్రలో కనిపించారు. మైత్రి మూవీ మేకర్స్ మొత్తం శెట్టి మీడియా వర్క్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమా కేవలం దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాదిలో కూడా సత్తా చాటింది. నిజానికి ఈ సినిమా మొదట అనుకున్నప్పుడు కేవలం ఒక భాగంగా విడుదల చేయాలని అనుకున్నారు.
కానీ ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టిన తరువాత నిడివి అంతకంతకూ పెరుగుతూ వెళ్లడంతో రెండు భాగాలుగా విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. అలా ఆ ప్లాన్ లో భాగంగా మొదటి భాగాన్ని పుష్ప ది రైజ్ అని రెండో భాగాన్ని పుష్ప ది రూల్ అని టైటిల్స్ ఫిక్స్ చేశారు. పుష్ప మొదటి భాగం 2021వ సంవత్సరంలో విడుదల చేయగా రెండో భాగాన్ని 2022వ సంవత్సరంలో విడుదల చేయాలని తొలుత భావించారు.. అయితే కేజిఎఫ్ సినిమా నార్త్ లో అద్భుతమైన వసూళ్లు సాధిస్తున్న క్రమంలో పుష్ప రెండో భాగానికి కూడా భారీగా బడ్జెట్ వెచ్చించి, నార్త్ ఆడియన్స్ కూడా మరింత మెచ్చే విధంగా తయారు చేయాలని భావిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

ఆ సంగతి ఎలా ఉంచినా ఇక ఈ సినిమా రెండో భాగం రిలీజ్ కాదు కదా ఇంకా షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వకపోయినా దానికి ఇప్పటి నుంచి రికార్డు లెవల్లో ఆఫర్స్ వస్తున్నాయట. ఈ సినిమాకు మన ఇండియాలో థియేట్రికల్ సహా ఓటీటీ హక్కులు భారీ ధర పలకగా ఇప్పుడు ఓవర్సీస్ హక్కుల మీద తాజా సమాచారం బయటకు వచ్చింది. అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమాకి ఓవర్సీస్ లో ఏకంగా మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాలుగా నిలిచినా భాహుబలి , RRRలకు దగ్గరగా ఆఫర్స్ వస్తున్నాయట. ఆ లెక్కన ఇంకా సినిమా మొదలు కూడా కాక ముందే ఈ పుష్ప ది రూల్ పై ప్రేక్షకుల్లో, ట్రేడ్ వర్గాల వారిలో హైప్ ఇంకో లెవెల్లో ఉందని అంటున్నారు. ఇక ఈ రెండో భాగానికి కూడా సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. రెండో భాగంలో ఫహద్ ఫాజిల్ రోల్ హైలైట్ కానుందని అంటున్నారు.