Pushpa The Rule: బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. పార్ట్ 2 రిలీజ్‌పై యూటర్న్

సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి తెలుగు సినీ ఇండస్ట్రీలోకి వచ్చినా.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, స్టైల్స్‌తో సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతోన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇంత కాలం టాలీవుడ్‌కే పరిమితం అయిన అతడు.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన 'పుష్ప: ద రైజ్'తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ అన్ని భాషల్లోనూ హిట్ అయింది. ముఖ్యంగా 'పుష్ప' హిందీలో వంద కోట్ల వసూళ్లను రాబట్టి సంచలనంగా నిలిచింది.

'పుష్ప ద రైజ్' మూవీ పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని అందుకోవడంతో.. ఈ సినిమా రెండో పార్ట్ 'పుష్ప ద రూల్'పై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ భాగానికి సంబంధించిన షూటింగ్‌ను మరింత ఉత్సాహంగా జరపాలని చిత్ర యూనిట్ భావించిది. ఇలా ఇప్పటికే షూటింగ్‌ను కూడా మొదలు పెట్టారు. అంతేకాదు, దాదాపు 20 శాతానికి పైగానే టాకీ పార్టును కూడా కంప్లీట్ చేసుకున్నారు. మిగిలిన భాగానికి సంబంధించిన షూట్‌ను కూడా శరవేగంగా జరిపేలా ప్రణాళికలు రూపొందించుకుంటోన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.

Allu Arjun Pushpa The Rule Movie Release on 2024 Summer

'పుష్ప ద రూల్' మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తారన్న దానిపై చిత్ర యూనిట్ ఇప్పటి వరకూ క్లారిటీ ఇవ్వలేదు. కానీ, దీనిపై ఎన్నో రకాల పుకార్లు మాత్రం షికార్లు చేస్తోన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల అవుతుందని టాక్ వినిపిస్తోంది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. పుష్ప రెండో భాగాన్ని వచ్చే ఏడాది వేసవిలోనే విడుదల చేయబోతున్నారట. అంటే ఇది 2024 ఏప్రిల్ లేదా మే నెలల్లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక, దీనిపై త్వరలోనే చిత్ర యూనిట్ కూడా అధికారిక ప్రకటన చేయబోతుందని సమాచారం.

బన్నీ - సుకుమార్ కలయికలో రాబోతున్న సినిమానే 'పుష్ప ద రూల్'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా చేస్తోండగా.. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా నటిస్తున్నాడు. సునీల్, అనసూయ కీలక పాత్రలు చేయనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X