Raaka: అల్లు అర్జున్ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో.. ఇక యాక్షన్ సీన్స్‌తో బాక్సాఫీస్ బద్దలే..

Allu Arjun Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) , అట్లీ(atlee) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ 'రాకా'(Raaka Movie). ప్రస్తుతం ఈ పాన్ ఇండియా మూవీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే పుష్ప 2 తో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్, ఇప్పుడు అట్లీ మార్క్ మాస్ ట్రీట్‌తో వస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై హైప్ అమాంతం పెరిగింది. ఇప్పటికే పలువురు స్టార్ నటులు ఈ సినిమాలో నటిస్తుంటే.. తాజాగా మరో బాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో నటించబోతున్నారట. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ?

అల్లు అర్జున్-అట్లీ కాంబో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'రాకా' అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో, ఒక పవర్ పుల్ డాన్ కథతో ఈ సినిమా తెరకెక్కుతోందని టాక్ వినిపిస్తోంది. భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ (Sun Pictures) ఈ సినిమాను నిర్మిస్తుండగా, అట్లీ తన స్టైల్‌లో హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషన్,మాస్ ఎలిమెంట్స్ మేళవించి ఒక అంతర్జాతీయ స్థాయి యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Allu Arjun Raaka Akshay Kumar Joins Atlee Film Massive Action Buzz Builds Up

కాస్టింగ్ పరంగా కూడా ఈ సినిమా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ప్రధాన కథానాయికగా నటిస్తుండగా, యంగ్ సెన్సేషన్స్ జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నట్లు సమాచారం. వీరితో పాటు నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతుందని టాక్. కథలో లేడీ రోల్స్ కు కూడా ప్రాధాన్యత ఉండబోతుందట.

ఇక తాజాగా బయటకు వచ్చిన సెన్సేషనల్ అప్డేట్ ఏమిటంటే? బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ (Akshay Kumar) ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారట. వచ్చే షెడ్యూల్‌లో అల్లు అర్జున్, అక్షయ్ కుమార్ మధ్య భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కాంబినేషన్ స్క్రీన్‌పై కనపడితే బాక్సాఫీస్ దగ్గర పండగ వాతావరణం ఖాయం అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. అక్షయ్ ఎంట్రీతో ఈ సినిమాకు పాన్ ఇండియా రేంజ్ మరింత బలపడనుంది.

అలాగే, అల్లు అర్జున్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నారనే వార్తలు కూడా ఆసక్తిని పెంచుతున్నాయి. అందులో ఒకటి నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రగా ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది. అలాగే రష్మిక పాత్ర కూడా విలన్ కోణంలో ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. అట్లీ సినిమాల్లో హీరోను స్టైలిష్‌గా, మాస్‌గా చూపించే విధానం తెలిసిందే. అలాంటి అట్లీ చేతుల్లో అల్లు అర్జున్ ఎలా కనిపిస్తారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.'రాకా' సినిమాకు నార్త్ ఇండియాలో కూడా భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం అనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Read more about: atlee akshay kumar allu arjun
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X