రామ్ చరణ్, అల్లు అర్జున్ గెస్ట్ లుగా ఖరారు
హైదరాబాద్ : ఒకే వేదికపై అల్లు అర్జున్, రామ్ చరణ్ గెస్ట్ లుగా ఆడియో ఫంక్షన్ కి హాజరవుతున్నారు. అల్లు శీరీష్ హీరోగా మారుతి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బేనర్ సమర్పరణలో బన్ని వాసు నిర్మిస్తున్న చిత్రం "కొత్త జంట''. ఈ చిత్రం పాటలను ఏప్రిల్ 12 న విడదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్ లో జరిగే ఈ ఆడియో ఫంక్షన్ కి రామ్ చరణ్, అల్లు అర్జున్ వస్తున్నారని విశ్వసనీయ సమాచారం. అలాగే ఈ ఫంక్షన్ కి మెగాభిమానులు భారీగా హాజరుకానున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.
నిర్మాత బన్ని వాసు మాట్లాడుతూ"గీతా ఆర్ట్స్ బ్యానర్ లో శిరీష్,రెజీనాలు జంటగా మారుతి దర్శకుడిగా తెరకెక్కుతున్న మా చిత్రం పాటలను ఏప్రిల్ 12 న విడదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము. ఆల్బమ్ లో అన్ని పాటలు సూపర్ గా ఉండటం వల్ల ఈ సినిమా మ్యూజికల్ ఎంటర్ టైనర్ గా తప్పకుండా విజయం సాధిస్తుంది.

అలాగే ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా "ఒసే రాక్షసి' అని సాగే పాటను విడుదల చేయనున్నాము. ఈ పాటను కొత్త కాన్సెప్ట్ తో చిత్రీకరించడం జరిగింది. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చిత్రాన్ని ప్రేక్షకులకి అందిస్తున్నాము. ఈ వేసవిలే ఉత్తమ కుటుంబ సమేతంగా చూడతగ్గ చిత్రంగా నిలుస్తుంది. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం నాకుంది అన్నారు.
దర్శకుడు మారుతి మాట్లాడుతూ " గీతా ఆర్ట్స్ లో నా నాలుగో చిత్రం చేయటం చాలా ఆనందంగా ఉంది. నా స్నేహితుడు, బన్ని వాసు నిర్మాతగా నాకు ఏది కావాలంటే అది అందజేశాడు. ఈ సినిమాలో అన్ని రసాలు ఉన్నాయి. సినిమాకు వచ్చిన వారు హాయిగా నవ్వుకుని ఇంటికి వెళతారు. ప్రేమ కథా చిత్రం కంటే ఈ సినిమా మరింత మంచి సినిమా అవుతుంది అన్నారు.
ఈ చిత్రంలో చిరంజీవి హిట్..ఖైదీ నెంబర్ 786లోని ఇటు అమలాపురం..అటు పెద్దాపురం అనే పాటను రీమిక్స్ చేస్తున్నారు. ఈ పాటను...సిల్క్ స్మిత అప్పట్లో చేసింది. మధురిమ, మధు, రావు రమేష్, పోసాని కృష్ణమురళి, రోహిణి తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కెమెరా: రీచర్డ్ ప్రసాద్, నిర్మాత: బన్నీవాసు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మారుతి.


Click it and Unblock the Notifications











