twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Allu Arjun రిజెక్ట్ చేసిన మరో కథకు యువ హీరో గ్రీన్ సిగ్నల్.. దిల్ రాజు బిగ్ ప్లాన్?

    |

    పుష్ప సినిమా ద్వారా దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ సెకండ్ పార్ట్ తో కూడా అంతకుమించి అనేలా విజయాన్ని అందుకోవాలి అని రెడీ అవుతున్నాడు. అయితే ఈ క్రమంలో బన్నీ కేవలం ఫ్యాన్ ఇండియా రేంజ్ లో ఉండే కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. రీసెంట్ గా అతను గతంలో చేయాలని అనుకున్న ఒక ప్రాజెక్టును కూడా క్యాన్సిల్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కథ బాగానే ఉన్నప్పటికీ అది పాన్ ఇండియా రేంజ్ కు సెట్టవ్వదని చెప్పడంతో ఆ నిర్మాత మరొక హీరో తో చేయాలని ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

    పాన్ ఇండియా స్టార్

    పాన్ ఇండియా స్టార్

    అల.. వైకుంఠపురములో సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ సక్సెస్ ను చూసిన అల్లు అర్జున్ ఆ తర్వాత పుష్ప సినిమాతో ఊహించని రేంజ్ కు వెళ్లిపోయాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కూడా 100 కోట్ల నెట్ కలెక్షన్ అందుకుని అతని మార్కెట్ ను ఒక్కసారిగా పెంచేసింది. బన్నీ కూడా ప్రభాస్ తర్వాత అత్యంత క్రేజ్ అందుకున్న హీరోగా నిలుస్తున్నాడు.

    పుష్ప 2 పై ఫోకస్

    పుష్ప 2 పై ఫోకస్

    అల్లు అర్జున్ భవిష్యత్తు ప్రాజెక్టులు అన్నీ కూడా పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగానే తెరపైకి వస్తాయి అని అర్థమవుతుంది. ముందుగా అతని ఫోకస్ మొత్తం కూడా పుష్ప 2 సినిమా పైన ఉంది. ఫస్ట్ పార్ట్ సక్సెస్ కావడంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ ను అంతకుమించి అనేలా తెరపైకి తీసుకురావాలి అని అల్లు అర్జున్ రెడీ అవుతున్నాడు. ఇక సుకుమార్ కూడా అందుకు తగ్గట్టుగానే స్క్రిప్ట్ చాలా బలంగా రెడీ చేస్తున్నాడు.

     ఆ సినిమా క్యాన్సిల్

    ఆ సినిమా క్యాన్సిల్

    అల్లు అర్జున్ పుష్ప 1 తర్వాత.. ఐకాన్ సినిమాను పూర్తి చేయాలని అనుకున్నాడు. వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ సినిమాను మూడు నెలల్లో పూర్తి చేసి ఆ తర్వాత పుష్ప సెకండ్ పార్ట్ ను పూర్తి చేయాలని అనుకున్నారు. కానీ ప్రస్తుతం బన్నీకి ఉన్న క్రేజ్ కారణంగా ఆ సినిమా ఫ్యాన్ ఇండియా రేంజ్ కు ఏ మాత్రం సెట్ అవ్వదు అని స్టార్ట్ అవ్వకముందే నిర్మాత దిల్ రాజుకు అడ్వాన్స్ కూడా వెనక్కి తిరిగి ఇచ్చినట్లు టాక్ అయితే వచ్చింది.

    కథ నచ్చడంతో

    కథ నచ్చడంతో

    అయితే నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ వేణు శ్రీరామ్ కు ఇచ్చిన మాట ప్రకారం ఐకాన్ సినిమాను ఎలాగైనా తెరపైకి తీసుకురావాలి అని సిద్ధమయ్యాడు. అంతేకాకుండా ఆ కథ కూడా బాగా నచ్చడంతో తప్పకుండా సక్సెస్ అవుతుంది అని మరొక హీరో తో చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఇటీవల దర్శకుడు మరొక హీరోకు ఐకాన్ కథ గురించి వివరించినట్లుగా సమాచారం.

    మరో హీరోతో

    మరో హీరోతో

    దర్శకుడు వేణు శ్రీరామ్ ఇటీవల యువ హీరో రామ్ పోతినేనిని కలిసి ఐకాన్ కథ గురించి చర్చలు జరిపినట్లు సమాచారం. రామ్ కు కూడా కథనచడంతో ఆ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట. అయితే అందులో కొన్ని మార్పులు చేస్తే బెటర్ అని సలహాలు ఇవ్వడంతో దిల్ రాజు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం దర్శకుడు మళ్ళీ కొత్త తరహాలో స్క్రిప్టును సిద్ధం చేయాలని ఫిక్స్ అయ్యాడట మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అఫీషియల్ గా క్లారిటీ వచ్చేవరకు ఆగాల్సిందే.

    English summary
    Allu arjun rejected icon story and dil raju selected another hero
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X