Don't Miss!
- News తెలంగాణలో వచ్చే రెండు రోజులు వానలు: ఆ తర్వాత తీవ్రమైన ఎండలు, ఎల్లో అలర్ట్
- Sports ఆ భారత కుర్రాడు మామూలోడు కాదు- లారా
- Technology స్మార్ట్‌వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఇండస్ట్రీ హిట్‌గా అల వైకుంఠపురములో.. అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ ఎంతంటే..?
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అల వైకుంఠపురములో చిత్రం టాలీవుడ్ రికార్డులను తిరగరాస్తోంది. విడుదలైన అన్ని చోట్లా ప్రభంజనం సృష్టిస్తూ.. నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఒక్క నైజాంలోనే దాదాపు 40కోట్లకు పైగా కొల్లగొట్టిన రెండో హీరోగా అల్లు అర్జున్ రికార్డ్ సృష్టించాడు. ఈ రేంజ్లో అల వైకుంఠపురములో దూసుకుపోతూ నేటికీ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది.
ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్..
సంక్రాంతి బరిలో దిగిన అల వైకుంఠపురములో ఇప్పటికీ వసూళ్లను కొల్లగొడుతూనే ఉంది. మొదటి ఆట నుంచి మొదలు పెట్టిన వసూళ్ల వేట ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. విడుదలైన అన్ని చోట్లా అల వైకుంఠపురములో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో 116.44 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది.
టాప్ 3లో..
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం బాహుబలి రికార్డులకే ఎసరు పెట్టింది. ఇప్పటికే బాహుబలి మొదటి పార్ట్ రికార్డులను బ్రేక్ చేసింది. ఆంధ్ర, తెలంగాణలో టాప్-3 షేర్స్ తీసుకుంటే బాహుబలి- 2 (198.7 కోట్లు), అల వైకుంఠపురములో (116.44 కోట్లు), బాహుబలి (110.1 కోట్లు) వరుసగా ఉన్నాయి.
సంయుక్తంగా నిర్మించిన చిత్రం..
ఇంతటి భారీ విజయాన్ని అందుకున్న అల వైకుంఠపురుములో చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి. నిర్మాణ, ఫైనాన్స్ బాధ్యతలన్నీ హారిక హాసినియే చూసిందని, కేవలం సమర్పకుడిగా అరవింద్ వ్యవహరించాడు. తాజాగా అల్లు అర్జున్ రెమ్యూనరేషన్, అల్లు అరవింద్ వాటాలకు సంబంధించిన అప్డేట్ హల్ చల్ చేస్తోంది.
అల్లు అర్జున్ రెమ్యూనరేషన్..
అల వైకుంఠపురములో చిత్రానికి గానూ బన్నీ రెమ్యూనరేషన్ విషయమై వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు గానూ బన్నీ దాదాపు 24కోట్లు తీసుకున్నాడని టాక్. ఇవి కాక అల్లు అరవింద్ ఖాతాలో కూడా భారీగానే చేరబోతోన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన వారందరికీ పెద్ద మొత్తంలో లాభాలు వచ్చినట్టు.. ఇంకా వస్తున్నట్లు సమాచారం.