Allu Arjun: ఆ రూల్ బ్రేక్ చేస్తున్న అల్లు అర్జున్.. ఐకాన్ స్టార్ నయా ట్రెండ్..

Allu Arjun remuneration: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో బన్నీ కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుడుతున్నారు. స్టార్ హీరోలు కోట్ల రూపాయల ఫిక్స్‌డ్ రెమ్యునరేషన్ తీసుకునే రోజులు పోయి.. సినిమా సక్సెస్‌లో భాగస్వాములయ్యే బిజినెస్ షేరింగ్ మోడల్ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ మార్పుకు ఆరంభం పెట్టింది బన్నీనే అన్న మాట ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఈ తరుణంలో అట్లీ - అల్లు అర్జున్ కాంబో (AA23) మూవీ కోసం ఐకాన్ రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారింది.

అల్లు అర్జున్ కెరీర్ లో పుష్ప 2: ది రూల్ (Pushpa 2:The Rule) ఓ మైలు రాయి అని చెప్పవచ్చు. ఈ సినిమాకు అల్లు అర్జున్ సంప్రదాయ ఫిక్స్‌డ్ ఫీ తీసుకోకుండా, మొత్తం బిజినెస్‌లో 27 శాతం వాటాను తన రెమ్యునరేషన్‌గా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. థియేట్రికల్, డిజిటల్ (ఓటీటీ), శాటిలైట్ తదితర అన్ని రైట్స్ కలిపి ఈ మూవీ వరల్డ్‌వైడ్ దాదాపు రూ.1000 కోట్ల బిజినెస్ చేయడంతో బన్నీ ఖాతాలో సుమారు రూ.270 కోట్ల వరకు చేరాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

Allu Arjun Remuneration for Atlee Movie Rs 175 Cr Upfront and Profit Share Deal Goes Viral

సాధారణంగా స్టార్ హీరోలు సినిమా మొదలయ్యే ముందే భారీ పారితోషికం డిమాండ్ చేస్తారు. కానీ, అల్లు అర్జున్ మాత్రం 'పుష్ప 2'తో రిస్క్ తీసుకుని రివార్డ్ కొట్టేశాడు. సినిమా ఎంత పెద్ద హిట్ అయితే హీరో ఆదాయం అంత పెరుగుతుంది అనే ఈ మోడల్ వల్ల, స్టార్ ఎర్నింగ్స్ నేరుగా మూవీ పెర్ఫార్మెన్స్‌పై ఆధారపడుతున్నాయి. ఇదే ఇప్పుడు పాన్-ఇండియన్ ప్రొడక్షన్స్‌లో కొత్త బెంచ్‌మార్క్‌గా మారుతోంది.

ఇప్పుడు అదే ఫార్ములాను తన తదుపరి సినిమాలకు కూడా వర్తింపజేస్తున్నారు బన్నీ. ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ (AA22)లో అల్లు అర్జున్ నటిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ (Sun Pictures) సుమారు రూ.800 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తోంది. తాజా రిపోర్టుల ప్రకారం..ఈ ప్రాజెక్ట్ కోసం బన్నీకి రూ.175 కోట్ల అప్‌ఫ్రంట్ ఫీతో పాటు లాభాల్లో దాదాపు 15 శాతం వాటా ఇచ్చేలా డీల్ కుదిరిందట. సినిమా భారీ విజయం సాధిస్తే ఆయన మొత్తం ఆదాయం రూ.300 కోట్ల మార్క్‌ను దాటే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అంతేకాదు... ఈ సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్ తో చేయబోయే (AA23) ప్రాజెక్ట్‌కు కూడా ఇదే తరహా బిజినెస్ షేర్ మోడల్ అమలు చేయనున్నట్లు టాక్. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుండగా, బన్నీకి భారీ ఫిక్స్‌డ్ ఫీతో పాటు ప్రాఫిట్ షేర్ ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధమైనట్టు సమాచారం. సినిమా రిస్క్‌లో భాగస్వామిగా మారుతూ, సక్సెస్‌లో నేరుగా వాటా తీసుకునే ఈ విధానంతో అల్లు అర్జున్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో గేమ్‌చేంజర్‌గా మారుతున్నారు. 'పుష్ప 2' సక్సెస్ తర్వాత ఆయన స్టార్ పవర్ మరింత పెరగడమే కాకుండా, 2024లో ఇండియాలోనే అత్యధిక ఆదాయం పొందిన నటుడిగా నిలిచినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక ముందు రోజుల్లో ఈ రిస్క్- రివార్డ్ మోడల్ ను మరిన్ని స్టార్ హీరోలు అనుసరిస్తారా? ఫిక్స్‌డ్ ఫీలకు గుడ్‌బై చెప్పే రోజులు దగ్గరపడ్డాయా? అన్న ప్రశ్నలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఒక విషయం మాత్రం స్పష్టం.. అల్లు అర్జున్ తెచ్చిన ఈ కొత్త పే ఫార్ములా భారతీయ సినిమాకు కొత్త దిశ చూపిస్తోందనే చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X