హీరోయిన్స్ కి ముద్దు పెడితే అల్లు అర్జున్ ‘బాక్స్’ బద్దలే..?!
ముద్దు సీన్లు కావాలని పెట్టించుకునే హీరోలు మన టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు. కానీ అల్లు అర్జున్ కు మాత్రం ముద్దు పెట్టుకున్నప్పుడు బాగానే ఉన్నా..ఆ తర్వాతే ప్రేక్షకులు తనను ఓ రకంగా చూస్తున్నారని అర్థమయిపోయింది. గతంలో ఆర్య-2లో కాజల్ తో ముద్దు సీను పెట్టుకున్నాడు. కానీ అది అనుకున్నంత విజయవంతం కాలేదు. ఆ తర్వాత ఏడాది పాటు మనసుపెట్టి వరుడు చేశాడు. అందులోనూ భాను శ్రీ మెహ్రాను లిప్ కిస్ పెట్టుకున్నాడు. ఈ సినిమా పెద్దగా ఆదరణ పొందలేదు. పైగా ఆ సీన్ ఎందుకు పెట్టారు? అది అవసరమా? అని అడిగితే కథ డిమాండ్ మేరకే అని అప్పట్లో చెప్పాడు. అలాంటి వ్యక్తి ప్రస్తుతం తాను నటిస్తున్న బద్రీనాథ్ చిత్రంలో ముద్దు సీన్ లేకుండా చూడండి అని దర్శకుడిని కోరాడట. ఏది ఏమైనా ముద్దు పెట్టుకున్నా..ముచ్చటగా ఉండాలంటారు. మరి అలాంటి ముచ్చట అందరికీ రాదని బన్ని గుర్తు చేసుకున్నట్లున్నాడు. పాపం అల్లు అర్జున్ కి ముద్దంటే ఎంత భయమేస్తోందో.


Click it and Unblock the Notifications











