Pushpa 2 : అల్లు అర్జున్ కష్టాలు .. పుష్ప 2 షూటింగ్ రద్దు!
ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు భారతదేశంలోనే మోస్ట్ అవెయిటెడ్ మూవీ పుష్ప 2. మూడేళ్ల క్రితం అల్లు అర్జున్ - సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ది రైజ్ (పుష్ప 1)కి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ సినిమా హీరో అల్లు అర్జున్ సహా చిత్ర యూనిట్ ఎంతో కష్టపడింది. ఈ నేపథ్యంలో షూటింగ్ సమయంలో తాను పడిన ఇబ్బందులను పంచుకున్నారు బన్నీ. ఈ వివరాల్లోకి వెళితే.
దేశవ్యాప్తంగా ఇంతటి భారీ హైప్ ఉన్న పుష్ప 2కు రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. థియేట్రికల్ రైట్స్ కింద ఏకంగా రూ. 640 కోట్లు, డిజిటల్ రైట్స్ రూ. 275 కోట్లు, మ్యూజిక్ రైట్స్ రూ.65 కోట్లు, శాటిలైట్ రైట్స్ రూ.85 కోట్లు కలుపుకుని మొత్తంగా రూ. 1065 కోట్ల వ్యాపారంతో పుష్పరాజ్ రికార్డుల దుమ్ముదులిపాడు. అలాగే గతంలో ఏ భారతీయ సినిమాకు లేని విధంగా పుష్ప 2ని ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11500 థియేటర్స్‌లో రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.

పుష్ప పార్ట్ 1లో సమంతతో ఐటెం సాంగ్ చేయించిన సుకుమార్.. పార్ట్ 2లో శ్రీలీలకి ఆ ఛాన్స్ ఇచ్చాడు. కిస్సిక్ అంటూ ఆ మసాలా సాంగ్ అప్పుడే ట్రెండ్ అవుతోంది. ఇక పాట్నా వేదికగా రిలీజైన పుష్ప 2 ట్రైలర్ .. ఇండస్ట్రీలో రికార్డులను బద్ధలుకొట్టి సరికొత్త బెంచ్ మార్క్ సృష్టిస్తోంది. ఇలాంటి దశలో పుష్ప 2 వాయిదా పడినట్లుగా ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు రావడంతో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఘాటుగా స్పందించింది. పుష్ప 2 విడుదల అనుకున్న సమయానికే థియేటర్‌లో దిగుతుందని.. అమెరికాలో డిసెంబర్ 4న ప్రీమియర్స్‌తో సందడి మొదలవుతుందని క్లారిటీ ఇచ్చింది.
కాగా.. నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే సీజన్ 4 టాక్ షో అల్లు అర్జున్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలయ్య అడిగిన ప్రశ్నలకు బన్నీ ఆసక్తికరమైన ఆన్సర్లు ఇచ్చారు. ఈ క్రమంలోనే పుష్ప 2కే హైలైట్‌గా చెబుతున్న గంగమ్మ జాతర ఎపిసోడ్‌కు తాను కష్టపడినట్లు అల్లు అర్జున్ తెలిపారు. తాను లేడీ గెటప్ వేసుకున్నప్పుడు నర్తనశాలలో ఎన్టీఆర్ గెటప్ గుర్చొచ్చిందని.. ఈ సీన్ పర్ఫెక్ట్‌గా రావడానికి చీర, మేకప్, నగలపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని బన్నీ చెప్పారు.

గంటల కొద్ది ఆ గెటప్‌లో ఉండేసరికి బ్యాక్ పెయిన్ కూడా వచ్చిందని.. కొన్ని నెలల పాటు దీని వల్ల ఆరోగ్యం కూడా పాడయ్యిందని, తన కోసం షూటింగ్‌ని మధ్యలోనే రద్దు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని అల్లు అర్జున్ తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. వృత్తిపట్ల అల్లు అర్జున్ అంకిత భావాన్ని అభిమానులు మెచ్చుకుంటున్నారు. ఇక పుష్ప 2లో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఫహద్ ఫాజిల్, జగపతి బాబు, శ్రీకాంత్, సునీల్, అనసూయ కీలకపాత్రలు పోషించారు.


Click it and Unblock the Notifications











