బన్ని కోసం చరణ్ కథల్ని దొంగలిస్తున్నస్తున్న అల్లు అరవింద్..!?
రెండో సినిమాతోనే దిమ్మ తిరిగే విజయం సాధించిన రామ్ చరణ్ ఇప్పుడు సంకటస్థితిలో పడ్డాడు. వెంటనే సినిమా చేయడానికి స్టార్ డైరెక్టర్ ఎవరూ దొరక్క ఒక కొత్త దర్శకుడితో రిస్క్ చేస్తున్నాడు. రచ్చ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న సంపత్ నందిపై ఎవరికీ సరైన ఇంప్రెషన్ లేనే లేదు. అయినా కానీ సినిమాకి, సినిమాకీ మధ్య గ్యాప్ తగ్గించడం కోసం చరణ్ కాంప్రమైజ్ అయి ఈ చిత్రం చేసేస్తున్నాడు. నిజానికి చరణ్ కోసం కొందరు స్టార్ డైరెక్టర్లు కథలు సిద్ధం చేసుకున్నారు.
దిల్ రాజు ఓ కథ సిద్దం చేయించగా, త్రివిక్రమ్ ఒక కథ రాసుకున్నాడు. ఇప్పుడు ఆ రెండు కథలూ బన్నీ కెళ్లిపోయాయి. అలా జరగడానికి కారకులెవరనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బద్రినాథ్ తో పెద్ద హీరో అని చూపించడానికి ప్రయత్నించి ఖంగుతిన్న అల్లు అరవింద్ ఇప్పుడు చరణ్ కి మంచి కథలు దొరక్కుండా చేస్తూ కొడుకుని రేసులో ముందుంచాలని చూస్తున్నట్టు పుకార్లు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











