హీరోయిన్‌తో బన్నీ ఘాటు రొమాన్స్.. బాలీవుడ్ మూవీస్‌ను మించిపోయేలా.!

By Manoj Kumar P

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్పీడు పెంచేశాడు. 'నా పేరు సూర్య' తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకున్న బన్నీ.. ఇకపై వరుసగా సినిమాలు చేయాలని డిసైడ్ అయిపోయాడు. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్నాడు. ప్రస్తుతం బన్నీ త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది షూటింగ్ జరుగుతుండగానే.. సుకుమార్‌తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. అయితే, తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏంటా వార్త..? వివరాల్లోకి వెళ్తే..

ఆ సినిమా ఆగిపోయింది

ఆ సినిమా ఆగిపోయింది

వాస్తవానికి బన్నీ.. ‘అల.. వైకుంఠపురములో' తర్వాత దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో ‘ఎంసీఏ - మిడిల్ క్లాస్ అబ్బాయి' ఫేమ్ వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ‘ఐకాన్‌' అనే సినిమాను చేయాల్సి ఉంది. కానీ, ఈ సినిమాను ఆపుకుని మరీ సుకుమార్ ప్రాజెక్టును పట్టాలెక్కించబోతున్నాడు. దీంతో ఈ సినిమాపై అందరిలో ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోతున్నాయి.

సుకుమార్ సినిమా కథ ఇదే

సుకుమార్ సినిమా కథ ఇదే

కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న బన్నీ - సుకుమార్ సినిమా కథ గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో నడుస్తుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అడవులలో ఎర్ర చందనం గ్యాంగులు సాగించే అకృత్యాలు, నేర చరిత ఆధారంగా ఈ కథ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇందులో బన్నీని కూడా స్మగ్లర్‌గానే చూపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

మొత్తం అక్కడ తీయాలనుకున్నారు

మొత్తం అక్కడ తీయాలనుకున్నారు

ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం ఉన్న సినిమా కావడంతో దీని షూటింగ్ మొత్తం శేషాచలం అడవుల్లోనే తీయాలని అనుకున్నారు. ఆ ప్రాంతంలో ఎప్పటి నుంచో ఎర్ర చందనం స్మగ్లింగ్ జరుగుతుండడంతో పాటు ఆ చెట్లు కూడా ఎక్కువగా విస్తరించి ఉండడంతోనే చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, దీనికి ఏపీ అధికారులు పర్మీషన్ ఇవ్వలేదని ఇటీవల ఓ వార్త బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

ఆ హీరోయిన్‌తో రొమాన్స్

ఆ హీరోయిన్‌తో రొమాన్స్

ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న విషయం విధితమే. తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. ఈ సినిమాలో రష్మిక.. బన్నీ భార్య భర్తలుగా కనిపిస్తారట. అంతేకాదు, వీళ్లిద్దరి మధ్య వచ్చే రొమాన్స్ బాలీవుడ్ సినిమాలను గుర్తు చేసేలా ఉంటుందని తెలుస్తోంది. దీంతో ఈ సినిమాపై అందరిలో ఆసక్తి రెట్టింపు అవుతోంది.

Recommended Video

#CineBox : RRR Update : Olivia Morris Pairup With Jr. NTR In RRR Movie !
బన్నీ ఆశలన్నీ దీనిపైనే

బన్నీ ఆశలన్నీ దీనిపైనే

‘జులాయి', ‘సన్నాఫ్ సత్యమూర్తి' వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తున్న సినిమానే ‘అల.. వైకుంఠపురములో'. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో బన్నీ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X