twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యాభై కోట్ల భారీ బడ్జెట్ తో అల్లు అర్జున్ చిత్రం..పూర్తి డిటేల్స్

    By Srikanya
    |

    అల్లు అర్జున్ త్వరలో దాదాపు యాభై కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మితమయ్యే చిత్రంలో నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ ఈచిత్రాన్ని డైరక్ట్ చేయనున్నారు. అప్పట్లో రానా తో చేద్దామని ఓకే చేసుకున్న ప్రాజెక్టు ఇటు వచ్చిందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని ఓ లీడింగ్ నిర్మాత ఈ చిత్రం నిర్మిస్తున్నారు. కమల్ హాసన్ తో సెల్వ చేయనున్న ప్రాజెక్టు పూర్తికాగానే ఈ చిత్రం మొదలవుతుంది. ప్రి ప్రొడక్షన్ వర్క్ ప్రారంభమైంది. ఈ లోగా అల్లు అర్జున్ కూడా వివి వినాయిక్ తో చేస్తున్న బద్రీనాధ్ చిత్రం పూర్తి చేస్తారు. తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. స్పెషల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రంలో ప్రధానపాత్రను పోషిస్తాయి. ఈ సంవత్సరం చివరలో షూటింగ్ మొదలవుతుందని అంచనా. అయిదువేల సంవత్సరాల క్రితం కథతో సెల్వరాఘవన్‌ ఈ సినిమాను మలచనున్నారు. ఇది జానపదం అనొచ్చు..చరిత్రాత్మకం అనొచ్చు.అయితే ఇది పూర్తి వైవిధ్యమైన చిత్రం. ఈ చిత్రంలో అల్లు అర్జున్ ద్విపాత్రల్లో కనిపించనున్నారు.

    English summary
    Allu Arjun and Selvaraghavan have joined hands to make a fantasy flick with a staggering budget of Rs 50 Crores.This movie is likely to be directed by Selvaraghavan who earlier directed the super hit '7/G Brindavan Colony'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X