'అల.. వైకుంఠపురములో' డిమాండ్.. భారీ రేటు పలికిన డిజిటల్ హక్కులు
టాలీవుడ్ తెరపై మరోసారి తన స్టామినా చూపించేందుకు రెడీ అయ్యాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. 'నా పేరు సూర్య' సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఈ యంగ్ హీరో తాజాగా 'అల.. వైకుంఠపురములో' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అయ్యాడు. ఈ సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీగా రానుండటం ఈ సినిమాకు బాగా ప్లస్ అయింది. దీంతో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరుగుతోంది. ఈ మేరకు శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ అన్నీ భారీ ధరకు అమ్ముడవుతున్నాయని సమాచారం. 'నెట్ ఫ్లిక్స్'వారు ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను భారీ రేటుకు సొంతం చేసుకున్నట్టుగా తాజా సమాచారం.

ఇందుకు సంబంధించిన లావాదేవీలు ఇప్పటికే పూర్తయ్యాయని తెలుస్తోంది. దీనిపై అఫీషియల్ ప్రకటన ఇవ్వాలని భావిస్తోందట చిత్రయూనిట్. ఇప్పటికే విడుదలైన అన్ని అప్‌డేట్స్ బన్నీ అభిమానులను కనువిందు చేశాయి. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ సినిమా విడుదల కానుంది.
గీతా ఆర్ట్స్ బ్యానర్, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో భారీ హంగులతో రూపొందుతోన్న 'అల.. వైకుంఠపురములో' మూవీలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాపై అల్లు అర్జున్ అభిమానుల అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.


Click it and Unblock the Notifications











