'అల.. వైకుంఠపురములో' ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. బన్నీ కోసం ఇలా సీక్రెట్‌గా!

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా 'అల.. వైకుంఠపురములో'. ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్ర పోషిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు.

ఈ సందర్బంగా ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసిన చిత్రయూనిట్ ఇప్పటికే రెండు పాటలు విడుదల చేసి భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. మొదటి పాట "సామజవరగమన... నిను చూసి ఆగగలనా" ఎంతో వినసొంపుగా ఆకట్టుకోగా, రెండో పాట "రాములో రాములా... నా ప్రాణం తీసిందిరో" బన్నీ అభిమానులకు స్పెషల్ కిక్ ఇచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ సినిమాలో ఓ జానపద పాట కూడా పెట్టారట.

Allu Arjuns Ala Vaikunthapurramloo Folk Song Update

తమన్ స్వరపరిచిన ఈ పాట అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని టాక్ నడుస్తోంది. అయితే ఈ పాటను మాత్రం ముందుగా విడుదల చేయబోమని, సినిమాలో మాత్రమే చూపుతామని చిత్ర యూనిట్ వర్గాలు అంటున్నాయట. ఇక ఇప్పటికే విడుదలైన 'అల.. వైకుంఠపురములో' అప్‌డేట్స్ బన్నీ అభిమానుల్లో కొత్త ఊపు తీపుకొచ్చాయి కాబట్టి ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.

గీతా ఆర్ట్స్ బ్యానర్‌, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో రూపొందుతోంది 'అల.. వైకుంఠపురములో' మూవీ. చిత్రంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే లవ్ ట్రాక్ యువతకు మాంచి కిక్కివ్వనుందట. సుశాంత్, నివేదా పేతురాజ్, టబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్ కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X