త్రివిక్రమ్ శ్రీనివాస్ డేర్! హాట్ టాపిక్ అవుతున్న 'అల.. వైకుంఠపురములో' రన్ టైమ్

గీతా ఆర్ట్స్ బ్యానర్‌, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో భారీ హంగులతో రూపొందుతోంది 'అల.. వైకుంఠపురములో' మూవీ. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా జనవరి 12వ తేదీన విడుదలకు రెడీ అయింది. ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్ బయటకొచ్చింది. వివరాల్లోకి పోతే..

 భారీ ఎత్తున ప్రమోషన్స్.. సినిమాపై హైప్

భారీ ఎత్తున ప్రమోషన్స్.. సినిమాపై హైప్

అల్లు అర్జున్ గత సినిమా హిట్ కాకపోవడంతో ఈ సినిమాపై స్పెషల్ కేర్ పెట్టారు బన్నీ, త్రివిక్రమ్. ఈ మేరకు షూటింగ్ చేస్తూనే 'అల.. వైకుంఠపురములో' అప్‌డేట్స్, పాటలు విడుదల చేసి సినిమాపై హైప్ క్రియేట్ చేశారు. చిత్రంలోని రాములో రాములా, సామజవరగమన పాటలు రికార్డులు బద్దలు కొట్టాయి.

 జోష్‌లో యూనిట్.. వేగంగా పోస్ట్ ప్రొడక్షన్

జోష్‌లో యూనిట్.. వేగంగా పోస్ట్ ప్రొడక్షన్

'అల.. వైకుంఠపురములో' అప్‌డేట్స్‌కి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూసి చిత్రయూనిట్ ఖుషీ అవుతోంది. ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసిన యూనిట్.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా పూర్తిచేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా రన్‌టైమ్ విషయమై ఓ విషయం బయటకొచ్చింది.

'అల.. వైకుంఠపురములో' రన్‌టైమ్.. మరీ ఇంతనా?

'అల.. వైకుంఠపురములో' రన్‌టైమ్.. మరీ ఇంతనా?

'అల.. వైకుంఠపురములో' సినిమా రన్‌టైమ్ 185 నిమిషాలుగా ఉండనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అంటే మూడు గంటల కంటే కూడా 5 నిమిషాలు ఎక్కువే. చిత్రంలో ఉన్న కామెడీ, యాక్షన్ ఎపిసోడ్స్ కారణంగా ఇంత రన్‌టైమ్‌తో 'అల.. వైకుంఠపురములో' సినిమా లాక్ చేయబడిందని తెలుస్తోంది.

సక్సెస్ అయిన మహేష్ బాబు, రామ్ చరణ్

సక్సెస్ అయిన మహేష్ బాబు, రామ్ చరణ్

ఈ మధ్యకాలంలో ఇంత ఎక్కువ రన్‌టైమ్‌తో వచ్చిన సినిమాల్లో రామ్ చరణ్- రంగస్థలం (180 నిమిషాలు), మహేష్ బాబు- భరత్ అనే నేను (173 నిమిషాలు), బాలకృష్ణ- కథానాయకుడు (170 నిమిషాలు), అల్లు అర్జున్- నా పేరు సూర్య (168 నిముషాలు) ఉన్నాయి. అయితే ఇందులో రంగస్థలం, భరత్ అనే నేను సినిమాలు మాత్రమే బ్లాక్ బస్టర్ సాధించాయి.

త్రివిక్రమ్ శ్రీనివాస్ డేర్

త్రివిక్రమ్ శ్రీనివాస్ డేర్

మొత్తానికైతే ఫైనల్‌గా 'అల.. వైకుంఠపురములో' రన్‌టైమ్‌ 175 నిమిషాల కంటే తక్కువగా ఉండకూడని ఫిక్స్ అయ్యారట డైరెక్టర్ త్రివిక్రమ్. ఈ సినిమాలో ఉన్న సన్నివేశాలు ఏ మాత్రం బోర్ కొట్టకుండా 175 నిమిషాల పాటు ఎంటర్‌టైన్ చేస్తాయని ధీమాగా ఉన్నారట. కాకపోతే త్రివిక్రమ్ ఇంత రన్‌టైమ్ లాక్ చేయడమంటే అది ఆయన డేర్ మాత్రమే అని చెప్పుకుంటున్నారు జనం.

రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. కీలక పాత్రల్లో

రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. కీలక పాత్రల్లో

రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అల.. వైకుంఠపురములో సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు, సుశాంత్, నవదీప్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, నివేద పేతురాజ్, జయరాం, సత్యరాజ్, బ్రహ్మాజీ, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X