Just In
- 5 hrs ago
యంగ్ హీరోయిన్‌కు పెళ్లి.. మా ఆయన గొప్ప ప్రేమికుడంటూ పోస్ట్
- 6 hrs ago
గొల్లపూడి మరణం : ఆయన రాసిన ఆ నాటిక ఇష్టం.. సినీ పరిశ్రమకు తీరని లోటు.. కోట శ్రీనివాస్ కామెంట్స్
- 7 hrs ago
గొల్లపూడి మరణం : మాది గురుశిష్యుల సంబంధం.. ఆయన ద్వారానే ఆ అవకాశం.. చిరంజీవి స్పందన
- 7 hrs ago
‘సైరా’ సంచలనం: రికార్డ్ క్రియేట్ చేసిన చిరంజీవి సినిమా.. టాలీవుడ్లో ఫస్ట్ మూవీ ఇదే.!
Don't Miss!
- News
జర్మనీ యూనివర్శిటీలో కేరళ విద్యార్థిని: అనుమానస్పద స్థితిలో..చివరి ఫోన్ కాల్.. !
- Finance
నవంబర్ నెలలో 3 ఏళ్ల గరిష్టానికి రిటైల్ ద్రవ్యోల్భణం
- Technology
రెడ్మి కె30 4జీ vs రెడ్మి కె20, ఫీచర్లపై ఓ లుక్కేయండి
- Automobiles
2019 లో 10 టాప్ మోస్ట్ గూగిల్డ్ కార్స్
- Lifestyle
ఓ అందమైన వెన్నెల పున్నమి రాత్రి వేళ ఆమె గురించే ఆలోచిస్తున్న అతనికి ఓ అద్భుతం జరిగింది... అదేంటంటే..
- Sports
లాలిగా బ్రాండ్ అంబాసిడర్‌గా రోహిత్: తొలి నాన్ పుట్బాలర్గా అరుదైన ఘనత
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
విడుదలకు ముందే ప్రభంజనం.. ఫ్యాన్సీ రేటుకు 'అల...వైకుంఠపురములో..' హక్కులు
గత కొంత కాలంగా హిట్స్ లేక సతమతమవుతున్న అల్లు అర్జున్.. తన స్పీడ్ బయట పెడుతున్నాడు. టాలీవుడ్ తెరపై మరోసారి తన స్టామినా నిరూపించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మేరకు త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అల.. వైకుంఠపురములో' సినిమాకు శ్రీకారం చుట్టారు బన్నీ. విడుదలకు ముందే ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు నెలకొల్పడం చూసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది 'అల వైకుఠపురములో' సినిమా. ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన బన్నీ, త్రివిక్రమ్ ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని అప్డేట్స్ మెగా అభిమాన వర్గాల్లో జోష్ నింపాయి.

ఈ నేపథ్యంలోనే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌కు మంచి క్రేజ్ ఏర్పడింది. 'అల వైకుఠపురములో' రైట్స్ కోసం ట్రేడ్ వర్గాలు తెగ పోటీ పడ్డాయట. లేటెస్ట్ సమాచారం మేరకు ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్, శాటిలైట్ హక్కులకు ఫ్యాన్సీ ఆఫర్ దక్కిందట. 19.50 కోట్లకు ఈ హక్కులు అమ్ముడైనట్లు తెలుప్తోంది. దీంతో విడుదలకు ముందే బన్నీ ప్రభంజనం మొదలైందని ఖుషీ అవుతున్నారు ఆయన అభిమానులు.
గీతా ఆర్ట్స్ బ్యానర్, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో రూపొందుతోంది 'అల.. వైకుంఠపురములో' మూవీ. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. సుశాంత్, నివేదా పేతురాజ్, టబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్ కానుంది. భారీ అంచనాల నడుమ జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.