twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'అల.. వైకుంఠపురములో' టీజర్ సీక్రెట్! బన్నీ అభిమానులకు పండగే పండగ

    |

    త్రివిక్రమ్ శ్రీనివాస్- అల్లు అర్జున్ కాంబోలో భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది 'అల.. వైకుంఠపురములో' మూవీ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సంక్రాంతి కానుకగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుంచేందుకు అన్ని హంగులు దిద్దుతున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో షూటింగ్ చేస్తూనే ప్రమోషన్స్ మొదలుపెట్టి ఒక్కో అప్‌డేట్ ద్వారా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని రెట్టింపు చేస్తున్నారు.

    ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ''సామజవరాగమన, రాములో రాములా'' పాటలు రికార్డుల సునామీ సృష్టిస్తూ 'అల.. వైకుంఠపురములో' మూవీపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఎస్ఎస్ థమన్ అందించిన మ్యూజిక్, సిరివెన్నెల సీతారామశాస్త్రి అందించిన సాహిత్యం ప్రేక్షక లోకాన్ని మంత్రముగ్ధులను చేసింది. దీంతో పాటలే ఇలా ఉన్నాయంటే టీజర్, ట్రైలర్ మామూలుగా ఉండదని ఫిక్స్ అయ్యారు ప్రేక్షకులు.

    Allu Arjuns Ala Vaikunthapurramloo Teaser Update

    సంక్రాంతి కానుకగా జనవరి 12వతేదీన ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో టీజర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు బన్నీ ఫ్యాన్స్. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు 'అల.. వైకుంఠపురములో' టీజర్ డిసెంబర్ 7 లేదా 8 వ తేదీన విడుదల చేయాలని డిసైడ్ అయ్యారట త్రివిక్రమ్. బన్నీ అభిమానులు పండగ చేసుకునే ఈ టీజర్ కట్ చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

    'అల.. వైకుంఠపురములో' మూవీలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్ర పోషిస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో భారీ హంగులతో ఈ సినిమా రూపొందుతోంది.

    English summary
    Allu Arjun and trivikram new movie Ala Vaikutapuramlo. This movie will release on january 12th 2020. As per latest talk now this movie teaser release date fixed.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X