అల్లు అర్జున్ ఫాన్స్‌కి గుడ్‌న్యూస్.. అనుకున్నదానికంటే నెల ముందుగానే..!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న కొత్త సినిమా 'అల.. వైకుంఠపురములో'. బన్నీ కెరీర్‌లో 'నా పేరు సూర్య' డిసాస్టర్ తరువాత వస్తున్న సినిమా కావడంతో అల్లు అర్జున్, త్రివిక్రమ్ ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ద తీసుకొని రూపొందిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేసి ప్రేక్షకుల్లో ఆసక్తి నింపింది చిత్రయూనిట్. ఈ లుక్‌లో అల్లు అర్జున్ యమ స్టైలిష్‌గా కనిపించడం బన్నీ అభిమానులకు సూపర్ ట్రీట్ ఇచ్చింది.
ఇదిలాఉంటే తాజాగా బన్నీ అభిమానులను ఆనందపరిచే మరో వార్త బయటకొచ్చింది. అదే.. ఈ సినిమా టీజర్ గురించి. 'అల.. వైకుంఠపురములో' టీజర్ నవంబర్ 7న విడుదల చేయాలని భావించిందట చిత్రయూనిట్. కానీ తాజా సమాచారం మేరకు టీజర్ విడుదలను ఇంకో నెల ముందుకు జరిగి దసరా కానుకగా రిలీజ్ చేయాలనే నిర్ణయానికి వచ్చారట యూనిట్ సభ్యులు. ఈ మేరకు అక్టోబర్ 8వ తేదీని ఫిక్స్ చేశారని ఫిలింనగర్ టాక్.

ఈ చిత్రంలో అల్లు అర్జున్ రెండు డిఫెరెంట్ షేడ్స్‌లో కనిపించనున్నాడని, ఆయన డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడనే వార్త ప్రచారంలో ఉంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా విడుదల కానుంది. అల్లు అర్జున్ కెరీర్‌లో 19వ సినిమాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
గీతా ఆర్ట్స్ బ్యానర్, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో ఈ సినిమా తెరకెక్కుతోంది. చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సుశాంత్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాపై ఇటు త్రివిక్రమ్ అభిమానులు, అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.


Click it and Unblock the Notifications











