అల్లు అర్జున్..'ఆర్య 2' స్టోరీ లైన్ ఏమిటంటే...
అల్లు అర్జున్, కాజల్, నవదీప్ కాంబినేషన్ లో రెడీ అయిన ఆర్య-2 చిత్రం కథ ఆర్య లైన్స్ లోనే ఉంటుందని సమాచారం. అయితే స్క్రీన్ ప్లే, ప్రెజేంటేషన్ లో వేరియేషన్ చూపారని చెప్తున్నారు. ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న దాని ప్రకారం ఈ చిత్రంలో అల్లు అర్జున్ కి బాల్య స్నేహితుడు నవదీప్. చిన్నప్పటి నుంచీ ఇద్దరి మధ్యా విపరీతమైన పోటీ. అయితే రెగ్యులర్ గానే హీరో గారు నెగ్గి,నవదీప్ ఓడిపోతూంటాడు. అయితే ఇద్దరూ ఒకే అమ్మాయి(కాజల్)తో ప్రేమలో పడటంతో కథ వేడెక్కుతుంది. కానీ ముందుగా నవదీప్ బయటపడి తన ప్రేమకు సాయిం చేయమని అల్లు అర్జున్ ని అడుగుతాడు. దాంతో తను లవ్ నుండి డ్రాప్ అయి కాజల్ ని, నవదీప్ ని కలిపే క్రమంలో రకరకాల సాహసాలు చేస్తాడు. అయితే చివరకు ఆమె..తనతో ప్రేమలో పడిందని తెలుసుకుని ఎలా దక్కించుకున్నాడనేదే కథ అంటున్నారు. ఆర్య తరహాలో హీరో, హీరోయిన్, నెగిటివ్ క్యారెక్టర్ మద్యే మైండ్ గేమ్ లా కథ జరుగుతుందని అంటున్నారు. ఇక ట్రీట్ మెంట్ చాలా ఫన్నీగా ఉంటుందని ఫిల్మ్ సర్కిల్స్ అంటున్నారు. ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఎపిసోడ్స్ చాలా షాకింగ్ గా ఇంట్రస్టింగ్ గా ఉంటాయని అంటున్నారు. సుకుమార్ తన జగడం ప్లాప్ నుంచి కోలుకుని చేస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. బెస్టాఫ్ లక్ ఆర్య-2.


Click it and Unblock the Notifications











