హాట్ టాపిక్ :స్టేజీపై అల్లు అర్జున్ "నీ అమ్మ" పదం
హైదరాబాద్ : అల్లు అర్జున్ నిన్న ఆదివారం రాత్రి జరిగిన రేసు గుర్రం ఆడియో పంక్షన్ ప్రసంగిస్తూ అనుకోకుండా శృతిహాసన్ గురించి చెప్తూ..."నీ అమ్మ" అనే పదం వాడేసారు. ఆ తర్వాత వెంటనే స్టేజిపై ఉన్నాను..ఎదురుగా చాలా మంది ఉన్నారనే విషయం గమనించి సారి చెప్పి కొనసాగించారు. ఈ విషయం ఇప్పుడు ఫిల్మ్ సర్క్లిల్స్ సరదాగా చెప్పుకుంటున్నారు. బయిట రెగ్యులర్ లైఫ్ లో అలవాటైన కొన్ని పదాలు మనకు తెలియకుండానే, ఏ విధమైన ఇంటెన్షన్ లేకుండా ఎలా బయిటకు వస్తాయో అనేదానికి ఇదో ఉదాహరణగా చెప్తున్నారు.
బన్నీ ఏమన్నాడంటే... తల్లి తండ్రులు ఎన్ని కోట్లు ఇచ్చినా నేను కష్టపడి సంపాదించే నా చేతిలో ఉండే పదివేల రూపాయలకు ఉండే కాన్ఫిడెన్స్ వేరే అని నాకు గుర్తు చేసిన నా హీరోయిన్ కి ఇక్కడ లేకపోవచ్చు...కానీ ఓ ఆడపిల్ల..ఓ ఇండిడ్యువాలిటీ...అంటూంటాను.. నీకెందుకు సూపర్ స్టార్ కూతురివి..నీ అమ్మ హ్యాపీగా అంటూ తను నీ అమ్మ అనే పదం వాడానని గమనించి సారి,క్షమించండి అని చెప్పారు. దానికి ఆమె ''నా కాళ్ల మీద నేను నిలబడాలి'' అని సమాధానం చెప్పింది శ్రుతి. ఆమెకి సినిమా అంటే పిచ్చి'' అన్నారు.

అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'రేసుగుర్రం'. శ్రుతిహాసన్ హీరోయిన్. సురేందర్‌రెడ్డి దర్శకుడు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన 'రేసుగుర్రం' పాటల విడుదల వేడుకలో చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తమన్ స్వరాలందించారు. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), డా||కె.వెంకటేశ్వరరావు నిర్మాతలు.
చిరంజీవి మాట్లాడుతూ... ''బన్నీ హీరో కావాలని కోరుకున్న మొదటి వ్యక్తిని నేను. 'డాడీ'చిత్రంలో డ్యాన్స్ వేసే కుర్రాడి పాత్ర కోసం అనుకుంటే అల్లు అర్జునే గుర్తొచ్చాడు. ఆ ఒకటిన్నర నిమిషం సన్ని వేశంతో ఇండస్ట్రీ దృష్టిలో పడ్డాడు. క్రమశిక్షణ, కష్టపడే తత్వం బన్నీకి ఉన్నాయి. అవే అతనికి మంచి ఫలితాల్నిస్తున్నాయి. సురేందర్ రెడ్డి తీసిన 'కిక్' సినిమాని ఇటీవలే టీవీలో చూశాను. చాలా నచ్చింది. ఆ సమయంలో నేను రవితేజలా ఉండుంటే ఆ సినిమాని నేనే చేసేవాడినేమో అనిపించింది. చాలా మంచి దర్శకుడు సురేందర్‌రెడ్డి'' అన్నారు.
కోట శ్రీనివాసరావు, సుహాసిని మణిరత్నం, ప్రకాష్‌రాజ్, అలీ, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, ముఖేష్‌రుషి, ఆశిష్ విద్యార్థి, నవాజ్ సోనూ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: వక్కంతం వంశీ, కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: ఎస్.తమన్, కూర్పు: గౌతంరాజు, నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు, నిర్మాణం: శ్రీలక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్.


Click it and Unblock the Notifications











