సాహసం చేసిన అల్లు అర్జున్.. రోజుకు రెండు గంటలు అదే పని!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. తన కొత్త సినిమా అల..వైకుంఠపురములో.. పెద్ద సాహసం చేశాడని తెలుస్తోంది. త్రివిక్రమ్ సూచన మేరకు ఆయన బాగానే రిస్క్ తీసుకున్నాడట. ప్రస్తుతం ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ లో అల్లు అర్జున్ లుక్ ఎంత స్టైలిష్‌గా ఉందో తెలిసిందే. ఈ లుక్ లోకి ఆయన రావడం వెనుక చాలా స్టోరీనే ఉందట.
అల్లు అర్జున్ గత సినిమా 'నా పేరు సూర్య' కోసం కాస్త బరువు పెరిగాడు. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితం రాబట్టలేదు. దీంతో తదుపరి సినిమాపై ప్రత్యేక ఫోకస్ పెట్టాడు. ఈ మేరకు త్రివిక్రమ్ ఇచ్చిన సూచనలను తూచా తప్పకుండా పాటిస్తున్నాడట బన్నీ. సూపర్ స్టైలిష్ లుక్ లో కనిపించాలంటే.. ఈ సినిమా కోసం బరువు తగ్గమని త్రివిక్రమ్ ఇచ్చిన సూచన మేరకు బన్నీ సాహసం చేశాడట.

ఈ మేరకు క్వీటో డైట్ అనే టెక్నిక్ ఫాలో అయ్యాడట అల్లు అర్జున్. క్వీటో జెనిక్ డైట్ అంటే తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ లేకుండా జాగ్రత్త పడటం. ఇలా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ప్రతి రోజూ రెండు గంటల పాటు వ్యాయామం చేయడంతో బన్నీ బాగానే బరువు తగ్గాడట. అలా అలా త్రివిక్రమ్ ఏదైతే లుక్ అనుకున్నాడో.. ఆ లుక్‌కి మారిపోయాడట బన్నీ. ఈ రకంగా అల్లు అర్జున్ 14 కిలోల బరువు తగ్గినట్లు తెలుస్తోంది.
గీతా ఆర్ట్స్ బ్యానర్, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో రూపొందుతోంది 'అల.. వైకుంఠపురములో' మూవీ. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సుశాంత్, నివేదా పేతురాజ్, టబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











