రామ్ చరణ్ అనుకుంటే బన్నీ సీన్ లోకి వచ్చాడేంటి?

By Srikanya

హైదరాబాద్ : ఆ మధ్యన రామ్ చరణ్, బోయపాటి శ్రీను మధ్య డిస్కషన్స్ జరిగాయని వార్తలు వచ్చాయి. అయితే తర్వాత బోయపాటి చెప్పిన కథ తనకు నచ్చలేదని మొహమాటం లేకుండా రామ్ చరణ్ ఓ ఇంటర్వూలో చెప్పేసి ఆ ప్రాజెక్టుకు మంగళం పాడేసాడు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందనుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఇదే నిజమైతే మరి బెల్లంకొండ సురేష్ కుమారుడు తో ప్రారంభమైన ప్రాజెక్టు పరిస్ధితి ఏంటి అనేది ఓ మిలియన్ డాలర్ క్వచ్చిన్. ఆ ప్రాజెక్టు ..ఫండ్స్ లేక ఆగిపోయినట్లు గా చెప్పుకుంటున్నది నిజమేనంటారా.

ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా షెడ్యూలు బిజీగా సాగుతోంది. ఇదిలావుంటే, అల్లు అర్జున్ తర్వాతి చిత్రానికీ సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. ఇటీవలే బాలకృష్ణతో లెజెండ్ వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని అందించిన బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడని సమాచారం.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయని, ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తారని భోగట్టా. ఇప్పటికే అల్లు అర్జున్ బోయపాటి శ్రీనుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

Allu Arjun's green signal to Boyapati?

త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తున్న చిత్రం విషయానికి వస్తే...

ప్రముఖ రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కతోంది. ఆ చిత్రంలో ఇటీవలే వివాహామైన ప్రముఖ హీరోయిన్ స్నేహ ముఖ్య భూమిక పోషించనున్నారు. ఆ చిత్రంలో అల్లు అర్జున్ కు వదినా స్నేహ నటించనున్నారు. అయితే ఆ చిత్రంలో అల్లు అర్జున్ సోదరుడిగా, స్నేహాకు భర్తగా ఉపేంద్ర నటించనున్నారని సమాచారం. సమంతా, అదా శర్మ,రాశి ఖన్నా లు ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

హారిక అండ్ హాసిని పతాకంపై ఈ చిత్రాన్ని ఆర్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలోని ఓ కీలక పాత్రలో కన్నడ హీరో ఉపేంద్ర నటిస్తున్నారు. ఇ.వి.వి. సత్యనారాయణ రూపొందించిన కన్యాదానం తరువాత ఆయన తెలుగులో టాస్ చిత్రంలో నటించారు. అనంతరం ఆయన తెలుగులో నటిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X