శ్రద్దాదాస్ పై నెగిటివ్ ప్రచారం చేస్తున్న అల్లు అర్జున్ !?
ఆర్య 2 చిత్రంలో సెకెండ్ హీరోయిన్ గా చేసిన శ్రధ్దాదాస్ ని పెట్టుకోవద్దంటూ అల్లు అర్జున్ తన సర్కిల్స్ లో చెప్తున్నాడంటూ ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో గుప్పుమంటోంది. ఆమెను పెట్టుకుంటే ప్లాప్ తప్పదని, ఐరన్ లెగ్ చెప్తన్నాడని తెలుస్తోంది. ఇక బద్రీనాధ్ లో వివి వినాయిక్ ఆమెకు అవకాశమిస్తున్నాడని తెలుసుకుని ఆమె ముందే నానా మాటలు అన్నాడని అంటున్నారు. అలాగే తాను ఆర్య 2 అప్పుడు సుకుమార్ కి శ్రధ్దాదాస్ ని తీసుకోవద్దని చెప్పానని అయితే అతను వినలేదని, దాని ఫలితం కనపడిందని, ఆమె వల్ల సినిమాకు వన్ పర్శంట్ కూడా హెల్ప్ కాదని మరీ మరీ చెప్పుతున్నాడుట. కావాలనే అల్లు అర్జున్..ఆమెను పరిశ్రమలో లేకుండా చేస్తానని పట్టుపట్టి ఇలా అవకాశాలు చెడకొడుతున్నాడని శ్రద్దాదాస్ ఫీలవుతోందిట. ఇంతకీ అల్లు అర్జున్ కీ ఆమెకీ మధ్య ఏం జరిగిందో...ఎందుకు చెడిందో అని చెవులు కొరుక్కుంటున్నారు.
అల్లు అర్జున్ వివి వినాయిక్ బద్రీనాధ్ శ్రద్దాదాస్ సుకుమార్ ఆర్య 2 allu arjun vv vinayak sraddha das sukumar badrinath arya 2


Click it and Unblock the Notifications