హైదరాబాద్‌లో అల్లు అర్జున్ కొత్త ఇల్లు? అల్లువారి ప్యాలెస్ ఖరీదు ఎన్ని కోట్లంటే?

మెగా నిర్మాత అల్లు అరవింద్ తనయుడిగా, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు అల్లు అర్జున్. ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరిగా నిలిచారు. పుష్ప 2తో పాన్ ఇండియా హీరోగా అవతరించిన అల్లు అర్జున్‌కు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆయనతో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు బడా నిర్మాతలు క్యూలో వెయిట్ చేస్తున్నారు.

ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రాకా చిత్రంలో నటిస్తున్నారు బన్నీ. సైన్స్ ఫిక్సన్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బన్నీ ఓ వెరైటీ రోల్‌లో కనిపించనున్నారు. కత్తుల్లాంటి గోర్లు, గుండుతో వైల్డ్‌ లుక్‌లో భయపెడుతున్నాడు బన్నీ. ఈ పోస్టర్‌తోనే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అట్లీతో మూవీ షూటింగ్ ముగిసిన వెంటనే.. లోకేష్ కనగరాజ్, ప్రశాంత్ నీల్, సుకుమార్, సందీప్ రెడ్డి వంగా తదితరులతో అల్లు అర్జున్ సినిమాలు చేస్తారని ప్రచారం జరుగుతోంది.

Allu Arjun s New Luxury Mansion in Jubilee Hills Sparks Buzz in Hyderabad

అయితే అల్లు అర్జున్ తన కుటుంబంతో సహా హైదరాబాద్‌ను వీడి ముంబైలో సెటిల్ అవుతాడని ఊహాగానాలు వినిపించాయి. ఇటీవల బన్నీ ఎక్కువగా ముంబైలో గడపటం ఈ వార్తలకు బలాన్నిచ్చాయి. అయితే ఈ పుకార్లను అల్లు అర్జన్ తండ్రి అల్లు అరవింద్ కొట్టిపడేశారు. తన షూటింగ్స్ కోసమే అల్లు అర్జున్ ముంబైలో ఉంటున్నాడని.. ఆయన ఎప్పటికీ హైదరాబాద్‌ను వదిలి వెళ్లరని క్లారిటీ ఇచ్చారు. ఇక్కడే బన్నీకి సొంతిల్లు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఉన్నారని వీరందరినీ వదిలి అల్లు అర్జున్ ఎక్కడికి వెళ్లరని చెప్పారు అల్లు అరవింద్.

ఇదిలాఉండగా.. ఇప్పుడు బన్నీ గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హైదరాబాద్‌లో అల్లు అర్జున్ కొత్తింటికి మారనున్నారట. నగరంలోని జూబ్లీహిల్స్ ఏరియాలో తన మేనమామ చిరంజీవి నివాసానికి దగ్గరలోనే అత్యంత విలాసవంతమైన ఇంటిని బన్నీ శరవేగంగా నిర్మిస్తున్నారట. దాదాపు 4000 చదరపు అడుగుల వైశాల్యంలో అత్యంత విలాసవంతంగా, ఖరీదైన హంగులతో ఈ ఇంటిని అల్లు అర్జున్ నిర్మించనున్నారట. ఈ ఇంటికి సంబంధించిన పనులు దాదాపు 60 శాతం వరకు పూర్తయ్యాయట. మిగిలిన వర్క్స్ పూర్తి చేసి అతి త్వరలోనే భార్యాబిడ్డలతో గృహ ప్రవేశం చేయాలని బన్నీ భావిస్తున్నారట.

తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని ఏ హీరోకి లేని విధంగా అత్యాధునిక హంగులు, సకల సదుపాయలతో అల్లు అర్జున్ ఇల్లు ఉండబోతోందట. అలాగే టాలీవుడ్‌ ప్రముఖుల్లోనే అత్యంత ఖరీదైన నివాసంగా దీనిని తీర్చిబోతున్నారని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా తన స్థాయి పెరగడం.. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు నిర్మాతలు, ఇతర ప్రముఖులు, వేలాది మంది అభిమానులు కలిసేందుకు వస్తుండటంతో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని భారీ ప్యాలెస్ నిర్మాణానికి అల్లు అర్జున్ శ్రీకారం చుట్టారట. దీని విలువ ఇప్పటి వరకు 80 కోట్ల రూపాయలుగా తెలుస్తోంది. అయితే పూర్తిగా నిర్మాణం పూర్తయిన తర్వాత అన్ని సదుపాయాలతో కలిపి అల్లువారి ప్యాలెస్ విలువ 100 కోట్ల రూపాయల పైమాటేనని చెబుతున్నారు. మరి నిజంగానే అల్లు అర్జున్ భారీ ప్యాలెస్ నిర్మిస్తున్నారా? లేక పాత ఇంట్లోనే కొనసాగుతారా? అనేది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X