బాలీవుడ్ స్టార్ హీరోతో అల్లు అర్జున్.. అంతా సెట్ చేసిన డైరెక్టర్.. అదొక్కటే బాకీ?
పుష్ప సినిమా సూపర్ హిట్ కావడంతో అల్లు అర్జున్ క్రేజ్ ఉత్తరాదిలో కూడా బీభత్సంగా పెరిగిపోయింది. ఆయన క్రేజ్ వాడుకోవడానికి బాలీవుడ్ దర్శక నిర్మాతలు ఇప్పటికే రంగంలోకి దిగారు. కానీ ఇప్పటివరకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వార్తలు ఏవీ బయటకు రాలేదు. కానీ తాజాగా ఆయన ఒక బాలీవుడ్ సూపర్ స్టార్ తో కలిసి సినిమా చేసేందుకు బాలీవుడ్ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఆయన ఏ స్టార్ హీరోతో కలిసి సినిమా చేయబోతున్నారు? ఆ దర్శకుడు ఎవరు అని వివరాల్లోకి వెళితే

నార్త్ లో
పాన్ ఇండియా రేంజ్ లో మన సౌత్ హీరోలు ఒక్కొక్కరు సత్తా చాటుతున్నారు. ముందు ప్రభాస్ బాహుబలితో, తర్వాత యష్ కేజీఎఫ్ తో ఇప్పుడు బన్నీ పుష్పతో సత్తా చాటారు. ఇక RRRతో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు ఆ పై భీమ్లా నాయక్ తో పవన్ కళ్యాణ్ ఇలా అందరికీ అక్కడ బలమైన మార్కెట్ ఏర్పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిజానికి 90వ దశకంలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లు ఎంత ప్రయత్నించినా ఎంత మంచి హిట్లు కొట్టినా సౌత్ జెండా అక్కడ పాతలేకపోయారు.

సత్తా చాటి
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా రూపొందిన చిత్రం పుష్ప. డిసెంబర్ 17వ తేదీన విడుదలైన ఈ సినిమా మొదటి భాగం అద్భుతమైన విజయాన్ని అందించడమే కాక హిందీలో వంద కోట్ల కలెక్షన్లు కలిపి మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించి తెలుగు సినిమా సత్తా ఏమిటి అనేది ఉత్తరాదిలో మరోసారి చాటి చెప్పినట్టయింది.

రోహిత్ శెట్టి ప్లాన్
పుష్ప దెబ్బతో టాలీవుడ్ హీరో బన్నీ కాస్తా ఇప్పుడు నేషనల్ వైడ్ గుర్తింపు ఉన్న పాన్ ఇండియా హీరో అయ్యాడు. ఈ దెబ్బకు బాలీవుడ్ దర్శక నిర్మాతలు మెల్లగా తనతో భాగమయ్యేందుకు ప్లాన్లు వేసుకుంటున్నారు. అందులో భాగంగా అక్షయ్ కుమార్ తో దర్శకుడు రోహిత్ శెట్టి ప్లాన్ చేసుకున్న ఓ భారీ మల్టీస్టారర్ లో అల్లు అర్జున్ కి హీరో పాత్ర చేయాల్సిందిగా కోరినట్టు సమాచారం.

ఇద్దరు హీరోలకు
అయితే అంతా విన్న తరువాత అల్లు అర్జున్ సానుకూల సూచనలు చేసినట్టు చెబుతున్నారు. రెండు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్న సదరు ప్రాజెక్టులో ఇద్దరు హీరోలకు సమాన ప్రాధాన్యం ఉండేలా కథ రాసుకున్నారట రోహిత్ శెట్టి. నిజానికి ఆయన దక్షిణాది హీరోతో సినిమాలు చేయడానికి చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ కధ అయితే పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు.
Recommended Video

చూడాలి మరి
ఇక ఈ కాంబినేషన్ ఫైనల్ అయ్యాక నిర్మాత ఎవరన్న విషయం మీద క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక అల్లు అర్జున్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇంకా రెమ్యునరేషన్ కూడా ఊహించని విధంగా ఆఫర్ చేశారని టాక్ వినిపిస్తోంది. అయితే స్క్రిప్ట్ ఫైనల్ అయ్యాక బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇస్తారని కూడా టాక్ ఉంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.


Click it and Unblock the Notifications











