Pushpa రెండో పార్ట్‌కు కళ్లు చెదిరే ఆఫర్: స్టోరీ వినకుండానే అన్ని కోట్లు ఇచ్చేందుకు రెడీ
తెలుగు సినీ ఇండస్ట్రీలో యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, స్టైల్స్ ఇలా అన్నింట్లోనూ సత్తా చాటుతూ సుదీర్ఘ కాలంగా బడా హీరోగా వెలుగొందుతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. రెండేళ్ల క్రితం సంక్రాంతికి 'అల.. వైకుంఠపురములో' అనే సినిమాతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్న ఈ స్టైలిష్ హీరో.. గత ఏడాది చివర్లో 'పుష్ప' అనే పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పాన్ ఇండియా రేంజ్‌లో వచ్చిన ఈ చిత్రంతో తెలుగులోనే కాదు.. దేశ వ్యాప్తంగా గుర్తింపును అందుకున్నాడు. అదే సమయంలో ఈ సినిమాకు కలెక్షన్లు కూడా పోటెత్తడంతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో 'పుష్ప' మూవీ రెండో భాగానికి భారీ ఆఫర్ వచ్చిందట. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

పుష్పగా అల్లు అర్జున్ విశ్వరూపం
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ రూపొందించిన చిత్రమే 'పుష్ప'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటించింది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేశాడు. సునీల్, అనసూయ ఈ చిత్రంలో నెగెటివ్ రోల్స్ చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు. ఇది సూపర్ డూపర్ హిట్ అయింది.

రిలీజైన అన్ని భాషల్లోనూ సక్సెస్
గంథపు చెక్కల నేపథ్యంతో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా పాన్ ఇండియా వచ్చిన 'పుష్ప' మూవీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో తెరకెక్కింది. ఇలా దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. అందుకు అనుగుణంగానే అన్ని చోట్లా దీనికి భారీ రెస్పాన్స్ వచ్చి సూపర్ హిట్ అయింది. మరీ ముఖ్యంగా హిందీలో ఈ సినిమా భారీగా కలెక్షన్లతో హవా చూపింది.

పుష్పకు వచ్చిన లాభాలు ఎంత?
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'పుష్ప' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 146 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా ఐదు వారాల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 174.38 కోట్లు వసూలు చేసింది. దీంతో హిట్ స్టేటస్‌తో పాటు రూ. 28.38 కోట్ల లాభాలను కూడా సొంతం చేసుకుంది.

ఇక్కడ కంటే అక్కడ ఎక్కువగానే
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన 'పుష్ప' మూవీకి దేశ వ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. దీనికి సామాన్యులతో పాటు సెలెబ్రిటీలు కూడా ఫిదా అయిపోయారు. మరీ ముఖ్యంగా ఉత్తరాదికి చెందిన వాళ్లంతా అదిరిపోయే రెస్పాన్స్ అందించారు. ఇక, కొందరు క్రికెటర్లు అయితే పుష్ప పాటకు డ్యాన్స్‌లు కూడా చేస్తున్నారు. దీంతో ఈ సినిమా హైలైట్ అయిపోయింది.

రూల్ చేయడానికి వస్తున్న పుష్ప
'పుష్ప' మూవీ రెండు భాగాలుగా రూపొందనుంది. మొదటి దాన్ని 'పుష్ప.. ద రైజ్' అనే టైటిల్‌తో విడుదల చేశారు. అలాగే, ఇప్పుడు రెండో భాగానికి సంబంధించిన షూటింగ్ జరపబోతున్నారు. దీనికి 'పుష్ప.. ద రూల్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని కూడా సినిమాలోనే వెల్లడించారు. ఇందులో పుష్ప రూలర్‌గా మారడాన్ని చూపిస్తారని అంటున్నారు.

రెండో భాగానికి కళ్లుచెదిరే ఆఫర్
'పుష్ప' మూవీతో అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో రెండో పార్ట్‌కు సంబంధించిన షూటింగ్‌ను మరింత ఉత్సాహంగా జరపాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. త్వరలోనే దీన్ని ప్రారంభించాలని చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్రానికి కళ్లు చెదిరే ఆఫర్ వచ్చినట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీంతో సినీ పెద్దలంతా షాక్‌కు గురవుతున్నారు.
Recommended Video

స్టోరీ వినకుండానే రూ. 400 కోట్లు
ఇంకా షూటింగ్ ప్రారంభం కాకపోయినా.. కథ గురించి తెలియకపోయినా 'పుష్ప ద రూల్' మూవీకి ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ రూ. 400 కోట్లు ఆఫర్ చేసిందని తెలుస్తోంది. అంటే నేరుగా తమ సంస్థలో ఈ సినిమాను విడుదల చేయాలని ఈ మొత్తాన్ని ఆఫర్ చేశారట. కానీ, చిత్ర యూనిట్ మాత్రం దీనికి నిరాకరించిందని తెలుస్తోంది. ఇప్పుడీ న్యూస్ దేశ వ్యాప్తంగా వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











