రిపబ్లిక్ డే రోజు స్పెషల్ గా బన్ని
హైదరాబాద్: అల్లు అర్జున్ తన తాజా చిత్రం ‘సరైనోడు' ఫస్ట్ లుక్ వదలటానికి సమయం ఫిక్స్ చేసారు. సంక్రాంతికి విడుదల చేద్దామనుకున్న ఈ ఫస్ట్ లుక్ అనివార్య కారణాలతో కుదరలేదు. దాంతో ఈ నెల 26న రిపబ్లిక్ డే స్పెషల్ గా విడుదల చేస్తున్నారు. యాక్షన్ ఓరియెంటెడ్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ గన అనే పాత్రను పోషిస్తున్నారు.
మాస్, యాక్షన్, వినోదం ఇలా ఎలాంటి కథలో అయినా ఇట్టే ఇమిడిపోతాడు అల్లు అర్జున్. 'సన్నాఫ్ సత్యమూర్తి'తో కుటుంబ ప్రేక్షకులకూ దగ్గరయ్యాడు. హీరోలోని వీరత్వాన్ని ఓ స్థాయిలో చూపించే దర్శకుడు బోయపాటి శ్రీను. వీళ్లిద్దరి కలయికలో ఈ చిత్రం రూపుదిద్దుకొంటోంది.
గీతా ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రకుల్‌ప్రీత్ సింగ్, కేథరిన్ హీరోయిన్స్. శ్రీకాంత్, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే అల్లు అర్జున్, కేథరిన్, ఆది పినిశెట్టి తదితరులపై కొన్ని కీలకమైన సన్నివేశాలు తెరకెక్కించారు.

ఈ చిత్రం కోసం 'సరైనోడు' అనే పేరు పరిశీలిస్తున్నారు. బన్నీ తన సినిమాల్లో స్త్టెల్‌కి ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇందులోనూ విభిన్నమైన గెటప్‌లో కనిపించబోతున్నారట. యాక్షన్‌తో పాటు వినోదం, కుటుంబ బంధాలకూ ఈ చిత్రంలో ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది.
అలాగే ఈ చిత్రంలో చబ్బీ బ్యూటీ అంజలి గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. అల్లు అర్జున్, బోయపాటి కాంబినేషన్ లో రూపొందుతున్న సరైనోడు చిత్రంలో ఆమె నటించనుందని సమాచారం. ఈ సినిమాలో ఆమెది ఫుల్ ప్లెడ్జెడ్ రోల్ కాకపోయినా ఆమె స్పెషల్ అప్పీరియన్స్ సినిమాకు హైలెట్ గా నిలిచే పాత్ర అని చెప్తున్నారు.
ఓ సీన్, స్పెషల్ సాంగ్ అని చెప్తున్నారు. మొదటి ఈ పాత్రకు గానీ అనుష్క ను అనుకున్నా ఆమె డేట్స్ ఎడ్జెస్ట్ కాకపోవటంతో అంజలి సీన్ లోకి వచ్చిందని తెలుస్తోంది. సంగీతం: తమన్


Click it and Unblock the Notifications











