వామ్మో..! అల్లు అరవింద్ విశ్వరూపం చూపిస్తున్నాడు!

By Bojja Kumar

హైదరాబాద్: టాలీవుడ్ బడా నిర్మాతల్లో అల్లు అరవింద్ ఒకరు. ఆయన తలుచుకుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏదైనా చేయగలరు. ఆయనకు ఇండస్ట్రీలో అంత ఇన్ ఫ్లూయెన్స్ ఉంది. మరి అలాంటి వ్యక్తి స్వయంగా తాను నిర్మిస్తున్న సినిమా, పైగా తన కొడుకు అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా కావడంతో......తన పలుకుబడి అంతా ఉపయోగించబోతున్నారు. తన విశ్వరూపం చూపించబోతున్నారు.

సరైనోడు... టార్గెట్ రూ. 70 కోట్లు!

అల్లు అర్జున్ హీరోగా అల్లు అరవింద్ నిర్మాతగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘సరైనోడు' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఫస్ట్ టీజర్ శుక్రవారం విడుదదల చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, బెంగుళూరు ఏరియాల్లో ఉన్న దాదాపు 1000 థియేటర్లలో ఈ టీజర్ ప్రదర్శించబోతున్నారు. టీజర్ విషయంలోనే అల్లు అరవింద్ ఈ రేంజిలో హడావుడి చేస్తున్నారంటే.... సినిమా విడుదల ఏ రేంజిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

Allu Arjun's Sarrainodu To Pull Off A Rare Feat

ఎక్సక్లూజివ్: శ్రీజను చేసుకోబోయే కళ్యాణ్ ఇతనే(రేర్ ఫొటోలు)

సరైనోడు షూటింగ్ విశేషాలు...
అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సరైనోడు' చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. తాజాగా సినిమాకు సంబంధించిన స్పెషల్ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. ఈ సాంగు కోసం రూ. కోటిన్నర విలువ చేసే సెట్ వేసారు. ‘అల్లు అర్జున్, కేథరిన్ లపై ఈ స్పెషల్ సాంగ్ చిత్రీరిస్తున్నారు. ఇందుకోసం అన్నపూర్ణ స్టూడియోస్ లోని 7 ఎకరాల స్థలంలో రూ. కోటిన్నర ఖర్చు పెట్టి సెట్ వేసారు. ఈ సాంగులో దాదాపు 300 మంది డాన్సర్లు బ్యాగ్రౌండ్లో స్టెప్పులేస్తున్నారు. మరో మూడు రోజుల్లో సాంగ్ చిత్రీకరణ పూర్తి కాబోతోంది' అని యూనిట్ సభ్యులు తెలిపారు.

పాపులర్ బాలీవుడ్ కొరియోగ్రఫీ ద్వయం బాస్కో-కాసెర్ ఆధ్వర్యంలో సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ సాంగ్ చిత్రీకరణలో అత్యంత ఖరీదైన లాంబోర్గినీ కార్లను కూడుతున్నారు. ఇందుకోసం వాటిని ప్రత్యేకంగా రెంటుకు తెప్పించారు. సాంగ్ చాలా బాగా వస్తోందని, సినిమాలో ఇది హైలెట్ అవుతుందని అంటున్నారు.

బన్నీ సొంత బేనర్లో... ఆయన తండ్రి అల్లు అరవింద్ నిర్మాతగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. తమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్‌ జన్మదినం సందర్భగా ఏప్రిల్‌ 8న చిత్రాన్ని విడుదల చేసేందుకుసన్నాహాలు చేస్తున్నారు. యాక్షన్‌తో కూడిన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీకాంత్‌, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X