Don't Miss!
- News
హైదరాబాద్‌లో మరో దిగ్గజ సంస్థ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్: 1800 మందికి ఉపాధి
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Sports
టీ20ల్లో టాప్ ప్లేయర్లు.. వన్డేల్లో మాత్రం వేస్ట్.. టీమిండియా స్టార్ కూడా!
- Lifestyle
ఈ రాశుల వారు భగ్నప్రేమికులు, అలా పడిపోతారు ఇలా విడిపోతారు
- Finance
Adani Enterprises FPO: అనుకున్నది సాధించిన అదానీ.. మూడో రోజు మ్యాజిక్.. ఏమైందంటే..
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
అల్లు అర్జున్ కొడుకు సినీ రంగ ప్రవేశం
హైదరాబాద్ :వారసులు తెరపై కనిపించటం మామూలే. క్రితం సంవత్సరం మహేష్ బాబు కుమారుడు గౌతమ్ 1 నేనొక్కిడినే అంటూ తెరపై కనిపించి అందరి మన్ననలూ పొందారు. ఇప్పుడు అల్లు అర్జున్ కుమారుడు సైతం తెరపై కనిపించనున్నారని సమాచారం. అలా కనిపించి అలా మాయమయ్యే షాట్ లో కాకుండా ఎండ్ క్రెడిట్స్ లో ముద్దులు ఒలుకుతూ కనిపిస్తాడని చెప్పుకుంటున్నారు. రీసెంట్ గా షారూఖ్ ఖాన్ కుమారుడు సైతం ఆయన చిత్రం అభిరామ్ సైతం హ్యాపీ న్యూ ఇయిర్ లో కనిపించిన సంగతి తెలిసిందే. ఇంతకీ ఏ సినిమాలో అంటారా ..మీరు గెస్ చేసిందే...అల్లు అర్జున్ తాజా చిత్రం సన్నాఫ్ సత్యమూర్తి లో ..
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
చిత్రం విశేషాలలోకి వెళితే..
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం 'సన్నాఫ్ సత్యమూర్తి'. సమంత, నిత్య మేనన్, ఆదా శర్మ హీరోయిన్స్ . ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ ముఖ్యపాత్రలు పోషించారు. త్రివిక్రమ్ దర్శకుడు. ఎస్.రాధాకృష్ణ నిర్మాత. స్పెయిన్‌లో అల్లు అర్జున్, సమంత, నిత్య మేనన్‌లపై మూడు పాటల్ని చిత్రీకరించారు. చిత్రీకరణ తుదిదశకు చేరుకొంది. ఈ నెల 15న పాటలను విడుదల చేస్తారు.

నిర్మాత మాట్లాడుతూ ''ఒక మంచి కుటుంబ కథతో రూపుదిద్దుకొంటున్న చిత్రమిది. కథకు తగ్గట్టుగా 'సన్నాఫ్ సత్యమూర్తి' అనే పేరును ఖరారు చేశాం. 'జులాయి' తర్వాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలసి చేస్తున్న ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలకు దీటుగా ఉంటుంది. అల్లు అర్జున్ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. భారీ తారాగణంతో రూపుదిద్దుకొన్న ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరిస్తుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం ప్రధాన బలం. ఏప్రిల్ 2న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామ''న్నారు.
‘జులాయి'తో అదిరిపోయే పాటలను అందించిన దేవీశ్రీ ఈ చిత్రానికి కూడా మంచి మ్యూజిక్ అందించాడని చిత్రబృందం అంటున్నారు. ‘సన్నాఫ్ సత్యమూర్తి' మ్యూజికల్ హిట్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తున్నారు. .
నిర్మాత రాధాకృష్ణ మాట్లాడుతూ ‘‘బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘జులాయి' ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఇదే కాంబినేషన్‌తో సినిమా రూపొందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అల్లు అర్జున్ అభినయం సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. త్వరలో పాటలను విడుదల చేస్తాం. వేసవి కానుకగా చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు.
సింధు తులాని, వెన్నెల కిశోర్, బ్రహ్మానందం, రావు రమేశ్, ఎమ్మెస్ నారాయణ తారాగణమైన ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం: ప్రసాద్ మురెళ్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పి.డి. ప్రసాద్, కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: త్రివిక్రమ్.