»   » ఆర్దిక ఇబ్బందుల్లో అల్లు అర్జున్ 'వరుడు' చిత్రం?

ఆర్దిక ఇబ్బందుల్లో అల్లు అర్జున్ 'వరుడు' చిత్రం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లు అర్జున్ వరుడు ప్రొడ్యూసర్ డి.వి.వి.దానయ్య ఆర్ధిక పరిస్ధితి ఏమీ బాగోలేదని ఫిల్మ్ సర్కిల్స్ లో గత కొద్ది రోజులుగా వినిపిస్తోంది. అతను రవితేజతో పూరీ దర్సకత్వంలో తీసిన నేనింతే చిత్రానికే బాగా దెబ్బతిన్నాడని, అంతకు ముందు దేశముదురు హిట్ తో ఈ చిత్రం కూడా అదే రేంజిలో వర్కవుట్ అవుతుందని ఎక్కడెక్కడనుంచీ ఫైనాన్సులు తెచ్చి పెట్టారని, ఆ సినిమా డెఫిషిట్ లో రిలీజ్ కావటం, ఆ తర్వాత ఆ డిస్ట్రిబ్యూటర్స్ కు సెటిల్ చెయ్యటంతో పూర్తిగా మునిగిపోయాడని చెప్తారు. అయితే ఈ లోగా గుణశేఖర్ తో వరుడు చిత్రాన్ని అల్లు అర్జున్ తో ప్రారంభించాడు. అయితే గుణశేఖర్ కూడా అనుకున్న బడ్జట్ ని ఎప్పుడో దాటేసాడని దాంతో దానయ్య చేతులెత్తేసే పొజీషన్ కి వచ్చారని చెప్తున్నారు. ఆ సమయంలో అల్లు అరవింద్ కలగచేసుకుని తన కుమారుడు కెరీర్ కి ఇది ఇబ్బంది పెట్టకూడదని సినిమాను కొనసాగించాడని అంటున్నారు. ఇక డిప్రెషన్ లో ఉన్న దానయ్యకి ఈ చిత్రం ఆర్ధికంగా హిట్ అయి చేయూతనిస్తే మంచి ప్రొడ్యూసర్ మిగులుతాడని అనుకుంటున్నారు. అయితే అల్లు అర్జున్, గుణశేఖర్ ఈ చిత్రంపై ఉన్న నమ్మకంతో బడ్జెట్ ని లెక్కచేయటం లేదని,అదే ఇబ్బంది పెట్టే అంశమని చెప్పుకుంటున్నారు. ఏదైమైనా మణిశర్మ సంగీతం వర్కవుట్ అయి సినిమా గుణశేఖర్ ఒక్కడు చిత్రంలా నిలబడితే ఎవరికీ ఇబ్బంది ఉండదు. అలా జరగాలని కోరుకుందాం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu