బన్నీతో కూడా రచ్చ చేయిస్తాడా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో 'రచ్చ' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సంపత్ నంది గతంలో 'ఏమైంది ఈవేళ' చిత్రానికి దర్శకత్వం వహించాడు. కేవలం ఒక్క సినిమా చేసినప్పటికీ సంపత్ నంది దర్శకత్వానికి ఆకర్షితుడైన రామ్ చరణ్ అతడితో రచ్చ చేయడానికి సిద్ధం అయ్యాడు. తాజాగా సంపత్ నంది దర్శకత్వ స్టయిల్ ను చూసి మరో మెగా హీరో అల్లు అర్జున్ కూడా ప్లాట్ అయ్యాడు. సంపత్ నంది ఇటీవల బన్నీకోసం ఓ కథను తయారు చేసుకున్నాడని, ఇది విన్న బన్నీ వెంటనే ఓకే చెప్పాడని తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్లోనే ఈ సినిమా తెరకెక్కే అవకాశం ఉంది. రచ్చ సినిమా పూర్తయిన తర్వాత ఈ సినిమాపై పూర్తి దృష్టి పెట్టనున్నారు.
ప్రస్తుతం బన్నీ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇలియానా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం డబ్బింగ్ ప్రస్తుతం శబ్దాలయా స్టూడియోస్ లో జరుగుతోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ తన పోర్షన్ కి డబ్బింగ్ చెప్పుకుంటున్నాడు. కామిడితో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందే ఈ చిత్రంలో ఎక్కువ పంచ్ లైన్ లతో కూడిన వన్ లైనర్స్ ఉండటంతో ప్రక్క డైలాగులు కీ ఇవ్వాల్సి వస్తోందని చెప్తున్నారు. ఇక సోనూసూద్ ఈ చిత్రంలో నెగిటివ్ పాత్రను చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











