2011వ సంవత్సరంలో కూడా సౌత్ స్కోప్ మ్యాగజైన్ అలజడి సృష్టిస్తుంది..
అల్లు అరవింద్ కుమారుడు అల్లు శిరిష్ సౌత్ స్కోప్ మ్యాగజైన్ ద్వారా మీడియా ఫీల్డ్ అడుగు పెట్టిన విషయం అందరికి తెలిసిందే. అనతికాలంలోనే తనకంటూ ఓప్రత్యేకతను సాధించుకున్నారు అల్లు శిరిష్. పోయిన సంవత్సరం అల్లు శిరిష్ మొదలు పెట్టినటువంటి ఈమ్యాగజైన్ మంచి పేరును సంపాదించుకుంది. అదే విధంగా ఈసంవత్సరం కూడా పన్నెండు మంది స్టార్ హీరోలు, హీరోయిన్లు కలగలిపి మ్యాగజైన్ రూపోందించడం జరిగింది.
ఈసంవత్సరం ఈమ్యాగజైన్ లోముఖ్యంగా సౌత్ ఇండియాకు సంబంధించినటువంటి అందరు తారలు ఫోజులివ్వడం జరిగింది. ఇందులో అల్లు అర్జున్, నాగ చైతన్య, రాణా, కార్తి, జీవా లుహీరోలు నటించగా, ఇక హీరోయిన్లు శ్రీయా శరన్, శృతిహాసన్, తమన్నా, సమంతా, కాజల్ అగర్వాల్, నిధి లుక్యాలెండర్ భామలుగా నటించారు. ఈసందర్బంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ పోయిన సంవత్సరం సౌత్ స్కోప్ క్యాలెండర్ కుమంచి రెస్పాన్స్ రావడంతో ఈసంవత్సరం కూడా పన్నెండు మంది తారలతో క్యాలెండర్ నువిడుదల చేయడం జరుగుతుందని అన్నారు. చివరగా ఈక్యాలెండర్ లోనటించినటువంటి నటీనటులు అందరికి పేరు పేరును తన ధన్యవాదులు తెలుపుతున్నా అన్నారు. దానికి కారణం చాలా బిజీ షెడ్యూలో ఉన్నప్పటికీ మేము అడగగానే ఇందులో నటించడానికి ఒప్పుకున్నందుకు అని అన్నారు.


Click it and Unblock the Notifications











