చేతికట్టుతో బన్నీ..మీడియాకి దొరక్కుండా జంప్
స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ గుట్టు చప్పుడు కాకుండా బెంగళూరుకు వచ్చి మీడియా కంటపడకుండా హైదరాబాద్ వెళ్లిపోయారు. ఇటీవల బెంగళూరు నగరంలోని ఓ విద్యా సంస్థలో జరిగిన కార్యక్రమానికి హాజరు కావడానికి అల్లు అర్జున్ బెంగళూరు వచ్చారు. కార్యక్రమంలో పాల్గొని నేరుగా విఠల్ మాల్య రోడ్డులోని యూబీ సిటీ చేరుకున్నారు. రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకున్నారు. ఉదయం టిఫిన్ చేశారు. సమాచారం తెలుసుకున్న అభిమానులు అక్కడికి చేరుకున్నారు. అల్లు అర్జున్ ఉన్నారా అని రిసెప్షన్‌లో వాకబు చేశారు. ఆయన లేరని సిబ్బంది సమాచారం ఇవ్వడంతో అభిమానులు నిరుత్సాహంతో వెనుదిరిగారు. వారు వెళ్లిన కొద్దిసేపటికి అల్లు అర్జున్ నేరుగా కారులో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు.
అల్లు అర్జున్ నటించిన బన్నీ సినిమా షూటింగ్ సమయంలో అర్జున్ ఎడమ చేతికి గాయమైందని గతంలో వెలుగు చూసింది. వైద్యుల సలహా మేరకు ఆయన ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడ ఎడమ చేతికి శస్త్ర చికిత్స చేయించుకున్నారని తెలిసింది. దీంతో చేతికి కట్టు (బ్యాండ్‌జే) వేశారు. అందువల్లే ఆయన మీడియా కంటపడరాదని భావించినట్లు తెలిసింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఒక సినిమా సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది. చేతి గాయం పూర్తిగా నయమైన తరువాత ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని అర్జున్ భావిస్తున్నారని సమాచారం. అందువల్లే బెంగళూరుకు వచ్చినా అల్లు గుట్టు చప్పుడు కాకుండా వెళ్లిపోయారని తెలిసింది. అందరూ బన్నీ ఇంకా ఆస్ట్రేలియాలో రెస్ట్ తీసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











