twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఉత్తరాంచల్ లో అల్లు అర్జున్ 'బద్రీనాధ్' కోసం భారీగా

    By Srikanya
    |

    అల్లు అర్జున్ తాజా చిత్రం బదిరీనాధ్ర్ చిత్రం కోసం బదిరీనాధ్ గుడి సెట్ ను ఉత్తరాంచల్ లో బదిరీనాధ్ దేవస్ధానానికి దగ్గరలో వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దాదాపు అవరై రోజులు పాటు రెండు షెడ్యూల్ లలో ఆ సెట్ లో కీలకమైన సన్నివేశాలను షూట్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ షూటింగ్ డేస్ లో దాదాపు నలభైరోజులు ఈ చిత్రంలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ (పీరియడ్ డ్రామా)కే సరిపోతుందంటున్నారు. అప్పటి జరిగిన కథకు ఈ కాలానికి లింక్ వేసే సన్నివేసాలుకు ఇరవై రోజులు కేటాయిస్తున్నారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్...మొదటి చిత్రం గంగోత్రి అనంతరం కీరవాణి మళ్ళీ అల్లు అర్జున్ తో చేయలేదు. ఇక చిన్ని కృష్ణ కూడా గంగోత్రి తర్వాత అల్లు అర్జున్ కి కథ ఇచ్చిన చిత్రం ఇదే. కమల్ కన్నన్ (మగధీర ఫేమ్) ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ సమకూరుస్తున్నారు. దశావతారం, రాఘవన్, అపరిచితుడు వంటి భారీ చిత్రాలకు ఛాయాగ్రహణం అందించిన రవి వర్మన్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. మే నెల చివరలో కానీ, జూన్ మొదటి వారంలో గానీ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. బన్నీ తర్వాత వివి వినాయిక్..అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఇది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X