Don't Miss!
- Sports
IND vs ENG: చెలరేగిన బెన్ స్టోక్స్.. కుప్పకూలిన భారత్! ఇంగ్లండ్ లక్ష్యం 378
- News
Wife: బిజీగా ఉంటున్న భర్త మీద కోపం, 7 నెలల కొడుకును చంపేసి ఆత్మహత్య, షాక్ !
- Finance
Uber Ride: రోడ్డు మీద విమానం ఛార్జీలు.. ముంబైలు ప్రయాణికులకు క్యాబ్ కష్టాలు.. వేల రూపాయలు..
- Lifestyle
Finance and career horoscope: జూలైలో 12 రాశుల ఆర్థిక మరియు కెరీర్ జాతకం..మరి మీ రాశికి ఎలా ఉందో తెలుసుకోండి..
- Travel
అద్భుత కళాకృతుల నిలయం.. రఘురాజ్పూర్..
- Technology
భారత్లో 46 వేల ఖాతాలపై నిషేధం విధించిన Twitter!
- Automobiles
భారత మార్కెట్లో సుజుకి కటానా Suzuki Katana స్పోర్ట్స్ బైక్ విడుదల; ధర రూ.13.61 లక్షలు
అల్లు అర్జున్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. పుష్ప 2 విషయంలో బన్నీ షాకింగ్ డిసిషన్?
స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఎలాంటి విజయాన్ని ఎందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా సాధించిన విజయంతో బన్నీకి బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇక పుష్ప సెకండ్ పార్ట్ తో కూడా అంతకుమించి అనేలా సక్సెస్ అందుకోవాలని బన్నీ ఆలోచిస్తున్నాడు. ఇక ఆ ప్రాజెక్ట్ పై ప్రస్తుతం ఎవరు ఊహించని విధంగా ఒక న్యూస్ అభిమానులలో టెన్షన్ ను కలిగిస్తోంది. బన్నీ తీసుకున్న నిర్ణయంపై అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఒకసారి ఆ వివరాల్లోకి వెళితే..

నెగిటివ్ రివ్యూలు వచ్చినా..
అల్లు అర్జున్ సుకుమార్ కలయికలో వచ్చిన పుష్ప పార్ట్ 1 ద్వారా వచ్చిన సక్సెస్ తో అల్లు అర్జున్ చాలా హ్యాపీ అయ్యాడు. అల.. వైకుంఠపురములో ఇచ్చిన సక్సెస్ ను కరెక్ట్ గా తన తదుపరి సినిమాకు హెల్ప్ అయ్యేలా చేసుకొని బాక్సాఫీస్ వద్ద నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేశాడు. ముఖ్యంగా నెగిటివ్ రివ్యూలు వచ్చినా కూడా కలెక్షన్స్ ఏ మాత్రం తగ్గలేదు.

10 కోట్లకు అమ్మితే..
హిందీలో పుష్ప సినిమా 100కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ అందుకుంటుందని ఎవరు ఊహించలేదు. అసలు హిందీలో పుష్ప సినిమాను విడుదల చేస్తారు అని చివరి నిమిషం వరకు సస్పెన్స్ గానే కొనసాగిందిమ్ ఎందుకంటే అక్కడ మొదట అల్లు అర్జున్ ఎలాంటి ప్రమోషన్ కూడా చేయలేదు. పెద్దగా హైప్ క్రియేట్ కాలేదు అని నిర్మాతలు తొందరపడి పది కోట్లకు అమ్ముడు పోవడంతో బయ్యర్లు భారీగా విడుదల చేసే మంచి లాభాలను సొంతం చేసుకున్నారు.

సెకండ్ పార్ట్ విషయంలో
ఇక పుష్ప పార్ట్ వన్ సక్సెస్ అయిన తర్వాత సెకండ్ పార్ట్ విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా భారీ స్థాయిలో విడుదల చేయాలని సుకుమార్ అల్లుఅర్జున్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు. అయితే సెకండ్ పార్ట్ విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉన్నట్లు కూడా కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ ఆలోచనకు తగ్గట్టుగానే సుకుమార్ కూడా సెకండ్ పార్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.

ఇంకాస్త ఎక్కువ సమయం?
ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో మరొక టాక్ వైరల్ గా మారింది పుష్ప షూటింగ్ ఇప్పట్లో మొదలయ్యే అవకాశం లేదని కథనాలు వెలువడుతున్నాయి. అసలైతే పుష్ప మొదటి భాగాన్ని పూర్తి చేసినప్పుడే సెకండ్ పార్ట్ కు సంబంధించిన షూటింగ్ దాదాపు 70 శాతానికి పైగా పూర్తయింది. మిగిలిన షూటింగ్ ను కొత్త తరహా ప్లానింగ్ తో పూర్తి చేయాలని అనుకున్నారు. అయితే అల్లు అర్జున్ పార్ట్ సెకండ్ స్క్రిప్ట్ విషయంలో మరిన్ని మార్పులు కావాలని అడగడంతో సుక్కు కొన్ని ప్రధానమైన అంశాలను చేంజ్ చేయడానికి ఇంకాస్త ఎక్కువ సమయాన్ని అడిగినట్లు తెలుస్తోంది.

ప్లాన్ చేంజ్?
ఈ క్రమంలో పుష్ప 2 వచ్చే ఏడాది సమ్మర్ లో కూడా రాకపోవచ్చని ఆ లోపు బన్నీ మరో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు కొత్త టాక్ వినిపిస్తోంది. మరో సినిమాను జెట్ స్పీడ్ లో ఫినిష్ చేసే విధంగా తనకు సన్నిహితుడైన బోయపాటి శ్రీను ని సంప్రదిస్తున్నట్లు సమాచారం. అయితే బోయపాటి రామ్ కోసం ఒక పాన్ ఇండియా సినిమా చేయాలని ఆలోచిస్తున్నాడు. మరి ఈ క్రమంలో బన్నీ రిక్వెస్ట్ తో అతను ప్లాన్ మార్చుకుంటాడా లేదా అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.