అల్లు అర్జున్ తో స్ర్కీన్ పై కనిపించనున్న భార్య స్నేహారెడ్డి..!?
అల్లు అర్జున్ తన ప్రియురాలు స్నేహా రెడ్డిని పెళ్ళి చేసుకున్ విషయం తెలిసిందే. ఈ జంట చాలా బాగుంటుందనే ప్రశంసలు కూడా వచ్చాయి. తాజాగా ఈ జంటను ఓ ప్రముఖ సంస్థ తమ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడానికి ఒప్పించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆల్రెడి కొన్ని యాడ్స్ లో హీరో క్రిష్ణ, విజయనిర్మల, అభిషెక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, సూర్య జోతిక, అమితాబ్-జయాబచ్చన్ యాడ్స్ లో నటించిన విషయం తెలిసిందే.
కాగా ఇప్పుడు వారి బాటలో అల్లు అర్జున్-స్నేహా రెడ్డిలు కూడా స్ర్కీన్ మీద కనుబడుకు సిద్దమైనట్టు సమాచారం. ఓ ప్రముఖ సంస్థ భారీ ఎత్తున్నఆఫర్ ఇచ్చారట. అల్లు అర్జున్ కూడా తన భార్య స్నేహా రెడ్డితో కలిసి నటించడానికి ఇష్టంగానే ఉన్నట్టు తెలుస్తోంది. భర్త ఇష్టానికి స్నేహా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. త్వరలోనే ఈ సంస్థకు చెందిన యాడ్ షూటింగ్ జరగనుందని వినికిడి..
allu arjun sneha reddy badrinath tamanna allu aravind vv vinayak అల్లు అర్జున్ స్నేహా రెడ్డి బద్రినాథ్ తమన్నా అల్లు అరవింద్ వివి వినాయక్


Click it and Unblock the Notifications