Allu Arjun: బాలీవుడ్ సంచలన దర్శకుడితో ఐకాన్ స్టార్ స్పెషల్ మీటింగ్.. త్వరలోనే బిగ్ సర్‌ప్రైజ్?
అల్లు అర్జున్ పుష్ప సినిమాతో మొత్తానికి దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ అందుకున్నాడు. పుష్ప కంటే ముందు కన్నడ మలయాళంలో సాలీడ్ గానే మార్కెట్ క్రియేట్ చేసుకున్న అల్లు హీరో యూట్యూబ్లో హిందీ ఆడియన్స్ ను కూడా ఎక్కువగా ఆకట్టుకున్నాడు. ఇక అల్లు అర్జున్ పుష్ప సినిమాతో డైరెక్టర్ గా హిందీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాడు. పుష్ప సినిమా ఊహించని విధంగా కలెక్షన్స్ అందుకోవడంతో ఇప్పుడు అక్కడి స్టార్ దర్శకులు కూడా అల్లు అర్జున్ పై ఫోకస్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదివరకే బాలీవుడ్ నుంచి కొన్ని ఆఫర్లు వచ్చాయి కానీ అవి అంతగా నచ్చకపోవడంతో బన్నీ రిజెక్ట్ చేశాడు. ఇక రీసెంట్ గా ఒక ప్రముఖ దర్శకుడు అల్లు అర్జున్ ను కలుసుకున్నట్లు సమాచారం. ఆ దర్శకుడు ఎవరు వారి కాంబినేషన్ లో సినిమా ఉంటుందా లేదా అనే వివరాల్లోకి వెళితే..

అనుమానాలతో విసుదలై..
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప మొదటి భాగం బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కేవలం హిందీలోనే ఈ సినిమా 100 కోట్ల కలెక్షన్స్ అందుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అసలైతే పుష్ప సినిమా అసలు అక్కడ విడుదల అవుతుందా లేదా అనే అనుమానాలు చివరి నిమిషం వరకు కొనసాగింది. కానీ ఆ తరువాత ఎలాగోలా విడుదల చేయగా పుష్ప సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ చేసింది.

ఇదివరకే బాలీవుడ్ ఆఫర్స్ రిజెక్ట్
పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ కు బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి చాలా ఆఫర్లు వస్తున్నాయని ఇదివరకే అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. ఇద్దరు ప్రముఖ దర్శకులు ఇదివరకే అల్లుఅర్జున్ ను ప్రత్యేకంగా కలుసుకొని కొన్ని కథలను కూడా వినిపించారట. ఇక ఆ కథలు పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోవడంతో బన్నీ నిర్మొహమాటంగా రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్లో డైరెక్ట్ సినిమా చేస్తే ఎలాంటి అనుమానాలు లేకుండా చాలా కొత్తగా ఉండాలి అని ఆలోచనతోనే బన్నీ ఆమె నిర్ణయం తీసుకున్నాడట.

మరో బాలీవుడ్ దర్శకుడితో..
ప్రస్తుతం కూడా అల్లు అర్జున్ కోసం కొంత మంది బాలీవుడ్ స్టార్ దర్శకులు సంప్రదింపులు జరుపుతున్నట్లు సోషల్ మీడియాలో ఒక టాక్ అయితే వైరల్ గా మారుతోంది. ముఖ్యంగా పద్మావత్, గంగుభాయి ఖతియావాడి సినిమాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ కూడా బన్నీతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదివరకే సంజయ్ ఒక టాలీవుడ్ స్టార్ తో చర్చలు జరపడం జరిగింది. కానీ అతను బిజీగా ఉండడంతో సంజయ్ వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది.

ప్రత్యేకంగా కలుసుకున్న బన్నీ
ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న ఒక కథనం ప్రకారం ఇటీవల అల్లు అర్జున్ ప్రత్యేకంగా సంజయ్ లీలా భన్సాలీ ఆఫీస్ దగ్గరికి వెళ్లి మరీ కలిసినట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. ఇద్దరూ కొన్ని గంటల పాటు ప్రత్యేకంగా మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక వీరి కలయికతో ఎప్పుడైనా అఫీషియల్ గా స్పెషల్ అనౌన్స్మెంట్ రావచ్చని మరొక టాక్ వినిపిస్తోంది.
Recommended Video


బన్నీ లైనప్..
అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 ని ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇక ఆ సినిమా తో పాటు అర్జున్ వేణు శ్రీరామ్ తో ఐకాన్ అనే మరొక సినిమాను కూడా చేయాల్సి ఉంది. ఇక కొరటాల శివ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయాలని అప్పట్లో అనుకున్నాడు. అలాగే మరో రెండు ప్రాజెక్టులు కూడా చర్చలో దశలో ఉన్నాయి. మరి ఈ బిజీ ప్లానింగ్ లో అల్లు అర్జున్ సంజయ్ తో నిజంగా సినిమా చేస్తాడా లేదా అనేది వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











