Pushpa 2: పుష్ప 2 గ్లింప్స్ లీక్.. అన్ని నిమిషాలు ఊచకోతే.. వీడియోలో మేజర్ హైలైట్ అదే
సినీ బ్యాగ్రౌండ్‌తోనే హీరోగా వచ్చినా.. కెరీర్ ఆరంభంలోనే తన సత్తాను నిరూపించుకుని.. తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేస్తూ.. సరికొత్త స్టైల్స్‌ను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. అలాగే, ఎన్నో విజయాలను అందుకుని తన రేంజ్‌ను పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే 'పుష్ప'తో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు 'పుష్ప 2'లో నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే న్యూస్ ఒకటి లీకైంది. ఆ సంగతులు మీకోసం!

పుష్పతో పాన్ ఇండియా సక్సెస్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రమే 'పుష్ప ది రైజ్'. పాన్ ఇండియా రేంజ్‌లో భారీ స్థాయిలో విడుదలైన ఈ చిత్రానికి అన్ని చోట్లా భారీ రెస్పాన్స్ వచ్చి సూపర్ హిట్ అయింది. మరీ ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ సినిమా వంద కోట్ల క్లబ్‌లో కూడా చేరింది. మొత్తంగా పుష్ప మేనియాతో ఇండియానే కాదు.. ప్రపంచమే ఊగిపోయిందని చెప్పొచ్చు.

భారీ వసూళ్లు... కోట్ల లాభాలతో
మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'పుష్ప'కు ఆరంభంలోనే అదిరిపోయే టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన లభించింది. ఫలితంగా ఈ చిత్రానికి కలెక్షన్లు పోటెత్తాయి. ఇలా ఇది ప్రపంచ వ్యాప్తంగా రూ. 175 కోట్లు పైగా రాబట్టింది. దీంతో హిట్ స్టేటస్‌తో పాటు రూ. 35 కోట్లకు పైగా లాభాలు కూడా సొంతమయ్యాయి.

రూల్ చేయడానికి బన్నీ రెడీ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' మొదటి భాగం సూపర్ హిట్ అవడంతో.. రెండో పార్టుపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. దీనిక 'పుష్ప.. ద రూల్' అనే టైటిల్ పెట్టారు. ఇందులో పుష్ప రూలర్‌గా ఎలా మారాడు అన్న విషయాన్ని హైలైట్ చేసి చూపించబోతున్నట్లు ఇప్పటికే తెలిసింది. ఈ చిత్రాన్ని మొదటి భాగం కంటే హై రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారని టాక్.

షూటింగ్ మొదలు.. స్పీడుగా
అల్లు అర్జున్‌కు 'పుష్ప' మూవీతో క్రేజ్ భారీ స్థాయిలో పెరిగిపోయింది. దీంతో రెండో పార్ట్‌కు సంబంధించిన షూటింగ్‌ను మరింత ఉత్సాహంగా జరపాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే షూటింగ్‌ను కూడా మొదలు పెట్టారు. ఇలా ఇప్పటికే చాలా భాగం పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు కూడా ఈ సినిమా పనులు ఎంతో స్పీడుగానే సాగుతున్నట్లు తెలుస్తోంది.

బన్నీ బర్త్‌డేకు గ్లింప్స్ రిలీజ్
'పుష్ప' మొదటి పార్ట్ వల్ల పెరిగిన అంచనాల వల్ల 'పుష్ప ది రూల్' కోసం బన్నీ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులంతా వేచి చూస్తున్నారు. కానీ, దీని నుంచి ఇప్పటి వరకూ అప్‌డేట్లు రాలేదు. దీంతో అందరూ నిరాశగా ఉన్నారు. దీన్ని పోగొట్టేందుకు చిత్ర యూనిట్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8వ తేదీన ఈ మూవీ నుంచి గ్లింప్స్ వీడియోను విడుదల చేస్తుందని టాక్.

షూట్ కంప్లీట్.. మ్యూజిక్‌పై
అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రాబోతున్న 'పుష్ప ది రూల్' గ్లింప్స్ వీడియోకు సంబంధించిన షూటింగ్ పార్ట్ అండ్ కట్ ఇప్పటికే కంప్లీట్ అయిందని తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ వీడియో ఏకంగా 3 నిమిషాల పాటు సాగుతుందట. ఇక, దీనికి సంబంధించిన మ్యూజిక్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని, త్వరలోనే అది పూర్తవుతుందని తెలిసింది.

గ్లింప్స్ వీడియోలో హైలైట్లు
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'పుష్ప ది రూల్' మూవీ నుంచి విడుదల కాబోతున్న గ్లింప్స్ గురించి తాజాగా మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు లీకయ్యాయి. మూడు నిమిషాల పాటు సాగే ఈ వీడియోలో ఆద్యంతం యాక్షన్ సన్నివేశాలనే చూపించబోతున్నారని తెలిసింది. అంతేకాదు, ఇందులో బన్నీ నోటి నుంచి వచ్చే పవర్‌ఫుల్ డైలాగ్ హైలైట్ కాబోతుందని సమాచారం.


Click it and Unblock the Notifications











