Pushpa 2: బిగ్ ట్విస్ట్ ఇచ్చిన అల్లు అర్జున్.. పుష్ప 2 రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎన్టీఆర్‌కు షాక్ తప్పదా!
యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, స్టైల్స్ ఇలా అన్నింటిలోనూ మెప్పించడంతో పాటు టాలీవుడ్‌లో తనదైన చిత్రాలు చేస్తూ సుదీర్ఘ కాలంగా బడా హీరోగా సత్తా చాటుతోన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. దీనికితోడు ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న అతడు.. క్రమంగా తన రేంజ్‌ను పెంచుకుంటోన్నాడు. ఇలా 'పుష్ప ది రైజ్' మూవీతో పాన్ ఇండియా స్టార్‌గానూ ఎదిగిపోయాడు. ఈ ఊపులోనే ఇప్పుడు దీనికి సీక్వెల్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చింది. ఆ సంగతులేంటో మీరే చూసేయండి!
ఊపు ఊపిన పుష్ప రాజ్: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన మాస్ యాక్షన్ మూవీనే 'పుష్ప ది రైజ్'. ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో భారీ స్థాయిలో విడుదలైంది. దీనికి అన్ని చోట్లా భారీ రెస్పాన్స్ వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది. మరీ ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ సినిమా వంద కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. అంతేకాదు, పుష్ప చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించింది.

రూల్ చేయడానికి రెడీగా: 'పుష్ప' మూవీని రెండు పార్టులుగా రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ముందుగానే ప్రకటించింది. అందుకు అనుగుణంగానే సెకెండ్ పార్టును'పుష్ప.. ది రూల్' అనే టైటిల్‌తో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో పుష్ప రూలర్‌గా ఎలా మారాడు అన్న విషయాన్ని హైలైట్ చేసి చూపించబోతున్నారు. ఈ చిత్రాన్ని మొదటి భాగం కంటే హై రేంజ్‌లో తీస్తున్నారు.
షూట్ స్పీడ్.. ఎంతంటే: 'పుష్ప ది రూల్' మూవీపై ప్రపంచ వ్యాప్తంగా హైప్ భారీ స్థాయిలో నెలకొంది. అందుకే దీనికి సంబంధించిన షూటింగ్‌ను మరింత ఉత్సాహంగా జరపాలని చిత్ర యూనిట్ భావించింది. ఇందులో భాగంగానే ఇప్పటికే షూటింగ్‌ను కూడా మొదలెట్టారు. ఇలా దాదాపు 40 శాతానికి పైగానే షూటింగ్ కూడా పూర్తైంది. ఇందులో కీలకమైన ఎన్నో సన్నివేశాలను చిత్రీకరించారు.
నేషనల్ అవార్డ్‌తో జోష్: 'పుష్ప ది రూల్' కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే అల్లు అర్జున్ తాజాగా 'పుష్ప' మూవీకి గానూ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డును సొంతం చేసుకున్నాడు. దీంతో 'పుష్ప 2' మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. అదే సమయంలో ఈ సినిమా షూట్‌లో బన్నీ మరింత ఉత్సాహంగా పాల్గొనబోతున్నాడు.

రిలీజ్ డేట్‌పై పుకార్లు:
హై రేంజ్ యాక్షన్‌తో రూపొందబోతున్న 'పుష్ప ది రూల్' మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ డేట్‌పై ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మొదట్లో ఇది 2023 డిసెంబర్‌లో రిలీజ్ అవుతుందని అన్నారు. ఆ తర్వాత 2024 సంక్రాంతికి వస్తుందని టాక్ వచ్చింది. ఇలా ఎన్నో డేట్లు కూడా తెరపైకి వచ్చాయి.

ఆరోజే రిలీజ్.. దేవరతో: 'పుష్ప 2' మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌పై తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఫిలిం నగర్ సమాచారం ప్రకారం.. ఈ సినిమా 2024, మార్చి 22వ తేదీన విడుదల అవుతుందని తెలిసింది. ఇదే జరిగితే ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కాబోతున్న జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' మూవీకి షాక్ తగిలే అవకాశం ఉందని చెప్పొచ్చు. అయితే, ఈ రిలీజ్ డేట్ వార్తలపై క్లారిటీ రావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











