Pushpa 2: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. పుష్ప 2 అప్పటికి వాయిదా.. ఆ సెంటిమెంట్ ప్రకారం హిట్టే!

తెలుగు సినిమా పరిశ్రమలోని స్టార్ హీరోలు అందరూ ప్రాంతీయ భాషా చిత్రాలతో ప్రాధాన్యం ఇచ్చేవారు. కానీ, కొంత కాలంగా వీళ్లంతా పాన్ ఇండియా బాటలో పయణిస్తున్నారు. అందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకడు. సుకుమార్ తెరకెక్కించిన 'పుష్ప ది రైజ్'తో సెన్సేషనల్ హిట్‌ను అందుకున్న అతడు.. ముఖ్యంగా హిందీ ఆడియెన్స్ మనసులను దోచుకున్న విషయం తెలిసిందే.

'పుష్ప ది రైజ్' భారీ విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా 'పుష్ప ది రూల్' సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్‌ను చిత్ర యూనిట్ ఎంతో ఉత్సాహంతో జరుపుతోంది. ఇలా ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా వరకూ టాకీ పార్టును కూడా కంప్లీట్ చేసుకున్నారు. మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయబోతున్నారు.

Allu Arjun Starrer Pushpa The Rule Movie Release Postponed To December

అదిరిపోయే కంటెంట్‌, స్పెషల్ మేనరిజంతో అన్ని ఇండస్ట్రీలను షేక్ చేసిన చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న 'పుష్ప ది రూల్'పై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడుతూనే ఉన్నాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే ఈ రెండో భాగాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన గ్లింప్స్ వీడియోకు రికార్డు స్థాయిలో స్పందన కూడా లభించింది.

సూపర్ హిట్ కాంబినేషన్‌లో హై రేంజ్ యాక్షన్‌తో రూపొందిన 'పుష్ప ది రూల్' మూవీని ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది. అందుకు తగ్గట్లుగానే ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ చిత్రం వాయిదా పడుతున్నట్లు తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది.

Allu Arjun Starrer Pushpa The Rule Movie Release Postponed To December

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. 'పుష్ప ది రూల్' మూవీని ముందుగా ప్రకటించినట్లుగా ఆగస్టు 15వ తేదీన విడుదల చేయడం లేదట. దీన్ని డిసెంబర్ నెలలో తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసినట్లు తెలిసింది. దీనికి షూటింగ్ ఆలస్యం కావడమే కారణం అని సమాచారం. ఇక, పుష్ప ఫస్ట్ పార్ట్ కూడా డిసెంబర్‌లోనే రావడంతో ఇది కూడా హిట్ అవుతుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్‌ - సుకుమార్ కలిసి చేస్తున్న 'పుష్ప ద రూల్' సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా చేస్తోండగా.. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా నటిస్తున్నాడు. సునీల్, అనసూయ కీలక పాత్రలు చేయనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ ఇస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X