పుష్ప టీంతో అల్లు అర్జున్ సడెన్ మీటింగ్.. 'పుష్ప2'ప్లాన్ మార్పు.. ఏం తేల్చారంటే...?
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఎంత అద్భుతమైన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగం మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఈ రెండవ భాగం షూటింగ్ మరి కొద్ది రోజుల్లో మొదలు కానున్న నేపథ్యంలో టీమ్ అంతా కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. ఆ మీటింగ్ ఎందుకు ? మీటింగ్ లో ఏమి విషయాలు చర్చించారు అనే విషయాలు కూడా బయటకు వచ్చాయి. ఆ వివరాల్లోకి వెళితే

పుష్ప రాజ్ క్రేజ్
అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ పుష్ప. ఈ సినిమా మొదటి భాగం డిసెంబర్ 17 వ తేదీన విడుదలయి అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందన్న కాకుండా ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్, అజయ్ ఘోష్, శత్రు లాంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

విజయాన్ని సాధించి
ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ సినిమా తమిళ తెలుగు కన్నడ హిందీ భాషల్లో కూడా విడుదలైంది. అన్ని భాషల్లో కలిపి ఈ సినిమాకు దాదాపు 300 కోట్ల రూపాయలు కలెక్షన్ రాగా అందులో వంద కోట్ల రూపాయలు ఏకంగా హిందీ నుంచి రావడం సినిమాకు బాగా ప్లస్ అయింది అని చెప్పవచ్చు.

యూనిట్ అంతా సమావేశం
నార్త్ లో కూడా విపరీతమైన క్రేజ్ ఏర్పడడంతో ఇప్పుడు రెండో భాగం మీద ఐదు భాషల ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా అల్లు అర్జున్ సహా సినిమా యూనిట్ అంతా సమావేశం అయినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ చిత్ర బృందంతో మాట్లాడటానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

షూట్ పూర్తి చేసి
చిత్ర దర్శకుడు సుకుమార్, నిర్మాతలు మరియు ముఖ్య నటీనటులు కూడా ఈ మీటింగ్ లో పాల్గొన్నట్లు సమాచారం. ఈ మీటింగ్ లో మాట్లాడుతూ అల్లు అర్జున్ సినిమా ఎట్టిపరిస్థితుల్లోనూ డిసెంబర్ కి విడుదల చేయాలని టీమ్ తో పేర్కొన్నారట. ఈ నేపథ్యంలోనే ఈ మార్చి మధ్యలో నుంచి షూటింగ్ మొదలు పెట్టి నాలుగు నెలల్లో షూటింగ్ పూర్తి చేయమని సుకుమార్ ను కోరినట్లు తెలుస్తోంది.

'దసరా'కి రిలీజ్
గతంలో జరిగిన పొరపాటు ఈసారి రిపీట్ కాకుండా షూట్ త్వరగా ప్లాన్ చేసుకుందామని అనుకున్నట్టు సమాచారం. అయితే ముందు నుంచి పుష్ప పార్ట్ 2ని డిసెంబర్ లో విధాలా చేయాలని అనుకున్నారు. కానీ తాజా మీటింగ్ లో మాత్రం ఈ సినిమాను దసరా బరిలో దింపాలనే అభిప్రాయాన్ని అల్లు అర్జున్ వ్యక్తం చేశారని తెలుస్తోంది.అలాగే ఈ సారి బాలీవుడ్ లో ముందు నుంచే భారీ ప్రమోషన్స్ చేసుకునే విధంగా ప్లాన్ చేయాలి అని కూడా మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నారట. చూడాలి మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది.


Click it and Unblock the Notifications











