బంధిపోటుగా అల్లు అర్జున్.. అదే కథను సుకుమార్ ఇలా సెట్ చేశాడా?
'రంగస్థలం' తర్వాత మహేష్ బాబుతో సినిమా చేయడానికి సుకుమార్ కథ సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే మైత్రి మూవీ మేకర్స్ ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు. అయితే ఫైనల్ స్క్రిప్టు విషయంలో సుకుమార్-మహేష్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో ఈ ప్రాజుక్ట్ ఆగిపోయింది. వెంటనే సుకుమార్ తన నెక్ట్స్ మూవీ అల్లు అర్జున్‌తో చేస్తున్నట్లు ప్రకటించారు. సడెన్‌గా ఈ ప్రకటన రావడం అభిమానులను ఆశ్చర్య పరిచింది. మహేష్ బాబుతో అనుకున్న కథనే అల్లు అర్జున్‌తో చేయడానికి సుకుమార్ డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది.

బంధిపోటుగా అల్లు అర్జున్?
అల్లు అర్జున్ - సుకుమార్ సినిమా గురించి రకరకాల ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో బన్నీ... బంధిపోటుగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. బన్నీ బాడీ లాంగ్వేజ్‌కు తగిన విధంగా కథను డిజైన్ చేశారట. అందుకు తగిన విధంగా కొన్ని మార్పులు చేశారట.

ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి...
శేషాచలం అడవుల బ్యాక్ డ్రాపుతో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో బన్నీ-సుక్కు మూవీ ఉంటుందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారని టాక్. మరి ఈ వార్తల్లో నిజం ఎంత అనేది తేలాల్సి ఉంది.

భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్
‘రంగస్థలం' సినిమా భారీ విజయం సాధించడంతో సుకుమార్ మీద మైత్రి మూవీ మేకర్స్ పూర్తి నమ్మకం పెట్టారని, బన్నీతో చేయబోయే చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

అనిల్ రావిపూడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మహేష్ బాబు
సుకుమార్‌తో చేయాలనుకున్న సినిమా రద్దు కావడంతో మహేష్ బాబు వెంనటే ‘ఎఫ్ 2' ఫేం అనిల్ రావిపూడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలువడనుంది. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నర్మించబోతున్నారు.


Click it and Unblock the Notifications











