For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అల్లు అర్జున్, సుకుమార్ సినిమా ఆలస్యం అవడానికి కారణం ఇదే.!

|

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్పీడు పెంచేశాడు. 'నా పేరు సూర్య' తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకున్న బన్నీ.. ఇకపై వరుసగా సినిమాలు చేయాలని డిసైడ్ అయిపోయాడు. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్నాడు. ప్రస్తుతం బన్నీ త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో అతడి సరసన పూజ హెగ్డే నటిస్తోంది. గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సుశాంత్, టబు, నివేథా పేతురాజ్ తదితర నటులు కనిపించనున్నారు.

ఇది పట్టాలపై ఉండగానే 'ఎంసీఏ - మిడిల్ క్లాస్ అబ్బాయి' ఫేమ్ వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో 'ఐకాన్‌' అనే సినిమాను ప్రకటించాడు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. స్క్రిప్టు సిద్ధంగా ఉండటం, అది బన్నీకి నచ్చడంతో సినిమా పట్టాలెక్కడమే ఆలస్యమని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలను నిజం చేస్తూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించేసింది.

Allu Arjun, Sukumar Movie Delay Reason

మరోవైపు, బన్నీ.. సుకుమార్‌తోనూ సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని మైత్రీ మూవీస్ అధినేతల్లో ఒకరైన నవీన్ యెర్నేని ఇటీవల అధికారికంగా ప్రకటించారు. 'బన్నీ - సుకుమార్ గారి సినిమా అక్టోబర్, నవంబర్‌లో స్టార్ట్ అవుతుంది. ఆ లోపు ఆయన త్రివిక్రమ్ గారి సినిమాను పూర్తి చేసేస్తారు. ఆ తర్వాతే ఇది మొదలు పెడతాం' అని ఆయన వెల్లడించారు.

అంతేకాదు, ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉన్నా అవలేదు. దీనికి కారణం ఈ సినిమా స్క్రిప్ట్‌లో మార్పులు చేయాలని బన్నీ.. సుకుమార్‌కు చెప్పడమేనని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. వాస్తవానికి ఈ సినిమా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుందని ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు ఇది మారుతుందని అంటున్నారు.

English summary
stylish star Allu Arjun has announced a new project with director Sukumar. Meanwhile, Allu Arjun is also concentrating on the Trivikram Srinivas directorial.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more