Don't Miss!
- News జగన్ పై దాడి ఘటనలో మరో టర్నింగ్ ! వడ్డెర సంఘాల ఎంట్రీ..
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Sports సూర్య సిగ్గుపడాలి.. క్రీడాస్ఫూర్తిని మరిచి నీఛమైన పని!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అల్లు అర్జున్, సుకుమార్ సినిమా ఆలస్యం అవడానికి కారణం ఇదే.!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్పీడు పెంచేశాడు. 'నా పేరు సూర్య' తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకున్న బన్నీ.. ఇకపై వరుసగా సినిమాలు చేయాలని డిసైడ్ అయిపోయాడు. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్నాడు. ప్రస్తుతం బన్నీ త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో అతడి సరసన పూజ హెగ్డే నటిస్తోంది. గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సుశాంత్, టబు, నివేథా పేతురాజ్ తదితర నటులు కనిపించనున్నారు.
ఇది పట్టాలపై ఉండగానే 'ఎంసీఏ - మిడిల్ క్లాస్ అబ్బాయి' ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'ఐకాన్' అనే సినిమాను ప్రకటించాడు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. స్క్రిప్టు సిద్ధంగా ఉండటం, అది బన్నీకి నచ్చడంతో సినిమా పట్టాలెక్కడమే ఆలస్యమని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలను నిజం చేస్తూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించేసింది.
మరోవైపు, బన్నీ.. సుకుమార్‌తోనూ సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని మైత్రీ మూవీస్ అధినేతల్లో ఒకరైన నవీన్ యెర్నేని ఇటీవల అధికారికంగా ప్రకటించారు. 'బన్నీ - సుకుమార్ గారి సినిమా అక్టోబర్, నవంబర్‌లో స్టార్ట్ అవుతుంది. ఆ లోపు ఆయన త్రివిక్రమ్ గారి సినిమాను పూర్తి చేసేస్తారు. ఆ తర్వాతే ఇది మొదలు పెడతాం' అని ఆయన వెల్లడించారు.
అంతేకాదు, ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉన్నా అవలేదు. దీనికి కారణం ఈ సినిమా స్క్రిప్ట్‌లో మార్పులు చేయాలని బన్నీ.. సుకుమార్‌కు చెప్పడమేనని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. వాస్తవానికి ఈ సినిమా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుందని ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు ఇది మారుతుందని అంటున్నారు.