twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బన్నీ లేకుండానే పరుగులు పెట్టిస్తోన్న సుకుమార్.. ఆ సీన్ సినిమాకే హైలెట్

    |

    రంగస్థలం చిత్రంతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు సుకుమార్. ఈ చిత్రం వచ్చి ఏడాది దాటి పోయినా మరో చిత్రాన్ని ప్రేక్షకులకు అందించలేకపోయాడు మన లెక్కల మాష్టారు. అయితే మధ్యలో అనుకున్న ప్రాజెక్ట్‌లు సెట్ కాకపోవడంతో తనకు కలిసొచ్చిన అల్లు అర్జున్‌తో ఫిక్స్ అయ్యాడు. ఎలాగూ హాట్రిక్ కొట్టేందుకు ఒక్క చిత్రమే బాకీ ఉండటంతో ఆ ముచ్చట కూడా తీరుందని ఇద్దరూ కలిసి ఓ ప్రాజెక్ట్‌ను చేసేందుకు సిద్దమయ్యారు.

    నాపేరు సూర్యతో గ్యాప్..

    నాపేరు సూర్యతో గ్యాప్..

    ఎన్నో అంచనాలతో వచ్చిన నా పేరు సూర్య బెడిసికొట్టడంతో మరో చిత్రాన్ని ప్రారంభించేందుకు చాలానే సమయం తీసుకున్నాడు బన్నీ. అయితే ఇది కావాలని తీసుకోలేదని అలా వచ్చిందని తన మీద తానే ఓ కౌంటర్ లాంటిది వేసుకున్నాడనుకోండి.. అది వేరే విషయం. బన్నీ

    త్రివిక్రమ్ సినిమాతో బిజీ..

    త్రివిక్రమ్ సినిమాతో బిజీ..

    దాదాపు ఏడాది గ్యాప్ ఇచ్చిన బన్నీ.. వెనువెంటనే ప్రాజెక్ట్‌లను ఓకే చేశాడు. మొదటగా త్రివిక్రమ్ అటుపై అల్లు అర్జున్, వేణు శ్రీ రామ్ అంటూ ఇలా లైన్లో పెట్టేశాడు. అయితే వేణు శ్రీ రామ్‌తో చేయబోయే ఐకాన్ సినిమా పోస్టర్ కూడా రిలీజ్ చేయగా.. ఈ చిత్రం ఆగిపోయిందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబోలో రాబోతోన్న అల వైకుంఠపురములో చిత్రం ఎంతటి సంచనాలను నమోదు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

    బన్నీ-సుక్కు సినిమా..

    బన్నీ-సుక్కు సినిమా..

    బన్నీ-సుక్కు సినిమా అంటే సగటు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలే ఉంటాయి. ఆర్య, ఆర్య2 లాంటి యూత్‌ఫుల్ ఎంటర్టైనర్లను అందించిన ఈ కాంబో ముచ్చటగా మూడో సారి వచ్చేస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కబోతోన్నట్లు ఇప్పటికే లీకులు హల్ చల్ చేస్తున్నాయి. ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్‌ పాత్రను పోషించబోతోన్నాడని, పూర్తి రా క్యారెక్టర్‌ను పోషిస్తున్నాడని టాక్.

    ఆ సీన్స్ హైలెట్..

    ఆ సీన్స్ హైలెట్..

    ఈ మూవీకి సంబంధించిన కొన్ని సీన్స్‌ను ఇప్పటికే షూట్ చేశారని టాక్. బన్నీ అవసరం లేని సీన్లను తెరకెక్కించారని, అంతేకాకుండా అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ సీన్‌కు సంబంధించిన జలపాతం సీన్‌ను కూడా షూట్ చేశారని సమాచారం. అటుపై బన్నీతో యాక్షన్ సీక్వెన్స్ తీసి, సీజీలో రెండింటిని కలుపుతారని టాక్. ఈ సీన్స్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయని తెలుస్తోంది.

    English summary
    Allu ARjun-Sukumar Movie Is In Full Swing. Buzz Is That Sukumar Doing Shooting With Out Allu ARjun In Kerala Forest. Allu Arjun Now Busy With Trivikram ALa Vaikunthapurramuloo Movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X