అల్లు అర్జున్ సినిమాకు మరో అట్రాక్షన్.. తమిళ స్టార్ హీరో తోడు.. వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్!
తెలుగు చిత్రసీమలో ఇతర భాషా స్టార్ హీరోల సందడి క్రమంగా పెరుగుతోంది. ఇక్కడి స్టార్ హీరోల సినిమాలకు ప్లస్ అయ్యేలా ఇతర భాషా హీరోలను తెలుగులో నటింపజేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే చిరంజీవి ప్రతిష్టాత్మక మూవీ 'సైరా నరసింహా రెడ్డి'లో నటించి మెప్పించిన విజయ్ సేతుపతి.. ఇప్పడు అదే మెగా కాంపౌండ్ హీరో అల్లు అర్జున్ సినిమాలో నటించనున్నాడని తెలుస్తోంది.
ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అల.. వైకుంఠపురములో' సినిమాలో నటిస్తున్న అల్లు అర్జున్.. ఈ సినిమా పూర్తయిన వెంటనే సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమాలో నటించనున్నారు. అయితే సుకుమార్ రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం.. ఈ సినిమాలో విలన్ రోల్ చాలా కీలకంగా సినిమాను మలుపుతిప్పేదిగా ఉంటుందట.

కాబట్టి ఈ విలన్ పాత్ర కోసం తమిళ చిత్రసీమ నుంచి ఫేమస్ నటుడిని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట సుకుమార్. ఈ మేరకు తమిళ హీరో విజయ్ సేతుపతిని పరిశీలనలో పెట్టారని సమాచారం. తమిళనాట విజయ్ సేతుపతికి సూపర్ క్రేజ్ ఉంది కాబట్టి బన్నీ సినిమాలో ఆయనతో విలన్ రోల్ చేయించి..
కోలీవుడ్ లోనూ ఈ సినిమాకు భారీ మార్కెట్ తీసుకురావాలని సుకుమార్ స్కెచ్ వేశారట. ఈ మేరకు విజయ్ సేతుపతితో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. ఇదే నిజమైతే బన్నీ సినిమాకు ఇది అదనపు అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు.
మరోవైపు బన్నీ- త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న అల.. వైకుంఠపురములో సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











