అల్లు అర్జున్- సుకుమార్ ముహూర్తం పెట్టేశారు.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
'నా పేరు సూర్య' ఆశించిన ఫలితం రాబట్టకపోవడంతో ప్రత్యేక శ్రద్ద తీసుకొని త్రివిక్రమ్ సెట్స్‌పై వాలాడు అల్లు అర్జున్. గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చిత్రంలో బన్నీ సరసన అందాల భామ పూజా హెగ్డే చిందులేస్తోంది. సీనియర్ హీరోయిన్ టబు ముఖ్యపాత్ర పోషిస్తోంది. యంగ్ హీరో సుశాంత్, మరో హీరోయిన్ నివేద పేతురేజ్ కూడా భాగమవుతున్నారని ఇటీవలే ప్రకటించారు యూనిట్ సభ్యులు.
అయితే ఈ ఏడాది భారీ హిట్ దిశగా అడుగులు వేస్తున్న అల్లు అర్జున్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఓ సినిమా, అలాగే సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ అయిందని, ఈ నెలలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయని తెలిసింది. ఈ నెలాఖరులో మొదలు పెట్టి సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూట్ ఛేష్యాలని ప్లాన్ చేస్తున్నారట. ఇందుకు సంబందించిన అధికారిక ప్రకటన అతిత్వరలో రానుందని సమాచారం.

ఇక బన్నీ- సుకుమార్ కథ విషయానికొస్తే.. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ మూవీ కథ నడుస్తుందట. సౌత్ ఇండియాలో విస్తరించి ఉన్న అడవులలో స్మగ్లర్స్ సాగించే ఎర్రచందనం గ్యాంగ్‌ల అకృత్యాలు, నేర చరిత ఆధారంగా ఈ కథ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ అంతా నల్లమల అడవుల్లో ప్లాన్ చేస్తున్నారని టాక్. 2020 ద్వితీయార్థంలో ఈ సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.


Click it and Unblock the Notifications











