For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్, సుకుమార్ నల్లమల అడవులకు వెళ్తారట.. ఎందుకో తెలుసా..?

    |

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్పీడు పెంచేశాడు. 'నా పేరు సూర్య' తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకున్న బన్నీ.. ఇకపై వరుసగా సినిమాలు చేయాలని డిసైడ్ అయిపోయాడు. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్నాడు. ప్రస్తుతం బన్నీ త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో అతడి సరసన పూజ హెగ్డే నటిస్తోంది. గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సుమంత్, టబు, నివేథా తదితర నటులు కనిపించనున్నారు.

    ఇది పట్టాలపై ఉండగానే 'ఎంసీఏ - మిడిల్ క్లాస్ అబ్బాయి' ఫేమ్ వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో 'ఐకాన్‌' అనే సినిమాను ప్రకటించాడు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. స్క్రిప్టు సిద్ధంగా ఉండటం, అది బన్నీకి నచ్చడంతో సినిమా పట్టాలెక్కడమే ఆలస్యమని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలను నిజం చేస్తూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించేసింది.

    Allu Arjun, Sukumar Will Go to nallamala

    మరోవైపు, బన్నీ.. సుకుమార్‌తోనూ సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని మైత్రీ మూవీస్ అధినేతల్లో ఒకరైన నవీన్ యెర్నేని ఇటీవల అధికారికంగా ప్రకటించారు. 'బన్నీ - సుకుమార్ గారి సినిమా అక్టోబర్, నవంబర్‌లో స్టార్ట్ అవుతుంది. ఆ లోపు ఆయన త్రివిక్రమ్ గారి సినిమాను పూర్తి చేసేస్తారు. ఆ తర్వాతే ఇది మొదలు పెడతాం' అని ఆయన వెల్లడించారు.

    ఇక, తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ మూవీ కథ నడుస్తుందట. సౌత్ ఇండియాలో విస్తరించి ఉన్న అడవులలో స్మగ్లర్స్ సాగించే ఎర్రచందనం గ్యాంగ్‌ల అకృత్యాలు, నేర చరిత ఆధారంగా ఈ కథ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ అంతా నల్లమల అడవుల్లో ప్లాన్ చేస్తున్నారని టాక్.

    English summary
    stylish star Allu Arjun has announced a new project with director Sukumar. Meanwhile, Allu Arjun is also concentrating on the Trivikram Srinivas directorial.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X