Pushpa 2 పాన్ ఇండియా రేంజ్ పెంచిన పుష్ప 2.. ఆ భాషలో కూడా అల్లు అర్జున్ మూవీ!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప సంచలనాలకు నిలయమైంది. ఇటీవలికాలంలో సమాజంపై తీవ్ర ప్రభావం చూపిన సినిమా మరొకటి లేదని చెప్పవచ్చు. ఈ సినిమాలో బన్నీ డైలాగ్స్, పాటలు దేశాన్ని ఊపేశాయి. చిన్నా, పెద్దా అంతా గడ్డం కింద చేతులు పెట్టేసి ''తగ్గేదే లే '' అనడం .. ''పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా .. ఫైర్ అబ్బా '' అన్న డైలాగులు పాపులర్ అయ్యాయి. చివరికి రాజకీయ నాయకులు కూడా ఎన్నికల ప్రచారంలో పుష్ప డైలాగ్స్ వాడుకున్నారు.

నార్త్‌లో ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా రిలీజైన పుష్ప కలెక్షన్ల సునామీ సృష్టించింది. పుష్పలో నటనకు గాను అల్లు అర్జున్‌కు ఏకంగా జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ వచ్చింది. తద్వారా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఈ ఘనత సాధించిన తొలి నటుడిగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించారు. దీంతో పుష్ప 2పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

Allu Arjun sukumar s Pushpa 2 The Rule is the FIRST Pan-India film to also release in Bengali

ఇప్పటికే పుష్ప 2 ట్రైలర్, టీజర్, మాతంగి గెటప్‌లో వున్న అల్లు అర్జున్ గెటప్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఈ ఏడాది ఆగస్ట్ 15న పుష్ప 2ను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తామని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఆల్రెడీ అనౌన్స్ చేసింది.

అంతేకాదు .. ప్రమోషన్ కార్యక్రమాల కోసం పశ్చిమ బెంగాల్‌లోని ప్రధాన నగరాలకు కూడా వెళ్లాలని చిత్రయూనిట్ భావిస్తోందట. చూస్తుంటే ఈసారి 1000 కోట్లు కొట్టాలని పుష్ప యూనిట్ ఫిక్స్ అయినట్లుగా వుంది. రిలీజ్‌కు మరో 100 రోజుల సమయమే వుండటంతో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు త్వరగా ముగించి.. ప్రచార కార్యక్రమాలను హోరెత్తించాలని సుకుమార్ భావిస్తున్నారట.

పుష్పకు సరైన ప్రమోషన్ కార్యక్రమాలు చేసుంటే రిజల్ట్ ఇంకో రేంజ్‌లో వుండేదని ఆయన ఇప్పటికీ చెబుతుంటారు. పుష్ప 2లో అలాంటి తప్పు చేయకుండా ప్రమోషన్ కార్యక్రమాలకు సరైన స్ట్రాటజీ ఫాలో అవ్వాలని సుకుమార్ అండ్ కో భావిస్తోందట. కొద్దిరోజుల క్రితం అల్లు అర్జున్ మాతంగి గెటప్‌లో వున్న టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుంచి దీనికి మంచి స్పందన వచ్చింది. 1 నిమిషం 8 సెకన్ల పాటు వున్న ఈ టీజర్ మొత్తం బన్నీపైనే సాగింది. ఆయనను తప్పించి మరో క్యారెక్టర్‌ను ఈ టీజర్‌లో చూపించలేదు. దీనికి డీఎస్పీ ఇచ్చిన బీజీ మాత్రం దద్ధరిల్లిపోయింది. కేవలం 12 గంటల్లోనే ఈ టీజర్ 51 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది.

Allu Arjun sukumar s Pushpa 2 The Rule is the FIRST Pan-India film to also release in Bengali

కాగా.. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ విలన్‌గా చేస్తున్నారు. అనసూయ, సునీల్, జగదీష్, బ్రహ్మాజీ ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు.

ఇంతకాలం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ చిత్రాల్లో ఏకకాలంలో విడుదలైతే దానిని పాన్ ఇండియా మూవీగా పరిగణించేవారు. కానీ పుష్ప 2 పాన్ ఇండియా డెఫినిషన్ మార్చేయాలని డిసైడ్ అయ్యింది. బెంగాలీ భాషలోనూ పుష్ప 2 రిలీజ్ కానుంది. తద్వారా బెంగాలీలో విడుదలవుతోన్న తొలి పాన్ ఇండియా సినిమాగా పుష్ప 2 రికార్డుల్లోకెక్కింది. అక్కడి ప్రేక్షకులను కట్టిపడేసేలా అండర్ వాటర్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను మేకర్స్ చిత్రీకరించారట. ఇది సినిమాకే హైలెట్‌గా వుంటుందని ఫిలింనగర్ టాక్. ఇదే నిజమైతే అల్లు అర్జున్ బాక్సాఫీస్ స్టామినా మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X